తెలంగాణ అగ్నిమాపకశాఖలో 10+2 అర్హతతో 751 ఫైర్ ఫైటర్ ఉద్యోగ నియామకాలు | Telangana Fire, Disaster Response Emergency and Civil Defence Department Fire Fighter Recruitment 2026
Telangana Fire, Disaster Response Emergency and Civil Defence Department Fire Fighter Recruitment 2026 : తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. కేవలం 10+2 అర్హతతో తెలంగాణ అగ్నిమాపక, విపత్తు ప్రతిస్పందన అత్యవసర మరియు పౌర రక్షణ శాఖ లో 751 ఫైర్ ఫైటర్ ఉద్యోగుల కోసం తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) 29 జులై నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫైర్ ఫైటర్ జాబ్స్ కి నెల జీతం 24,280-72,850/- మధ్యలో ఇస్తారు. అప్లై చేస్తే సొంత రాష్ట్రంలో సొంత జిల్లాలో ఉద్యోగం వస్తుంది. ఫైర్ ఫైటర్ 751 పోస్టులు భర్తీ చేస్తున్నారు

పై అర్హత కలిగిన అభ్యర్థులు అధికార వెబ్సైట్ https://www.tgprb.in/ ద్వారా మాత్రమే ఆన్లైన్ లో చేసుకోవాలి. ఈ ఉద్యోగులకు అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు తెలంగాణ స్థానిక సంబంధితులై ఉండాలి. ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు సర్టిఫికెట్ కలిగి ఉండాలి. వయసు 18 సంవత్సరాలు నుంచి 22 సంవత్సరాల మధ్యలో ఉండాలి ఒకటి జూలై 2026 నాటికి లెక్కేస్తారు. GO 87 ప్రకారం గరిష్ట వయసు మరో 5 సంవత్సరాలు పెంచడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు సడలింపు ఉంటుంది. అంటే వీటన్నిటి కలిపి 32 సంవత్సరాల వయసు లోపల కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్థులకు గరిష్ట వయసు 27 ఏళ్లు ఉండాలి. ఇవే కాకుండా పోలీస్ స్పెషల్ ప్రొడక్షన్ ఫోర్సెస్, ఫైర్, ఎమర్జెన్సీ & జైలు విభాగాలలో నాలుగు నోటిఫికేషన్ విడుదల చేశారు.
పోలీస్ ఉద్యోగాలకు ఈ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి
•BC అభ్యర్థులకు 01 ఏప్రిల్ 2026 లేదా ఆ తరువాత తీసుకున్న నాన్ క్రీమీలేయర్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి.
•SC క్యాండిడేట్ కు గ్రూప్ 1,2,3 సబ్ క్లాసిఫికేషన్ తో ప్రభుత్వ జారీ చేసిన కమ్యూనిటీ సర్టిఫికెట్ తప్పనిసరి.
•లోకల్ కాండిడేట్ కోసం ఒకటి నుంచి ఏడో తరగతి స్టడీ సర్టిఫికెట్స్ లేదా రెసిడెన్సి సర్టిఫికెట్ ఉండాలి.
•EWS రిజర్వేషన్ కు 1 ఏప్రిల్ తర్వాత జారీ చేసిన సర్టిఫికెట్ ఉండాలి.
• అలాగే స్పెషల్ కేటగిరి వారికి ఆయా సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి.

🛑Notification Pdf Click Here
🛑Apply Online Link Click Here

