10+2 అర్హతతో రైల్వే శాఖలలో 590 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది | RRB Paramedical Recruitment CEN 05/2026 Full Notification Released for 590 Nursing Superintendent, Pharmacist & Lab Assistant Gr II More Posts, Online Form
RRB Paramedical Recruitment CEN 05/2026 Full Notification Released for 590 Nursing Superintendent, Pharmacist & Lab Assistant Gr II More Posts: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB)లో పారా-మెడికల్ పోస్టుల నియామకం కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 15.09.2026 నుంచి ఆన్లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ 14.10.2026 (23:59 గంటలు) RRB వెబ్సైట్లో (https://rrb.indianrailways.gov.in/) లో ఆన్లైన్ లో అప్లై చేయాలి.
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB)లో నర్సింగ్ సూపరింటెండెంట్, డయాలసిస్ టెక్నీషియన్, ఆరోగ్య మరియు మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ II, ఆడియాలజిస్ట్ & స్పీచ్ థెరపిస్ట్, ఫార్మసిస్ట్ (ప్రారంభ గ్రేడ్), రేడియోగ్రాఫర్ ఎక్స్-రే టెక్నీషియన్, ECG టెక్నీషియన్, ఆప్టోమెట్రిస్ట్ & ల్యాబ్ అసిస్టెంట్ Gr. II పారా-మెడికల్ ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ లో 15 సెప్టెంబర్ 2026 నుంచి 14 అక్టోబర్ 2026 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, స్కిల్ టెస్ట్ & ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు- ₹250 to 500/-, వయసు 18- 40 ఏళ్లు. జీతం రూ.21,700/- రూ.1,42,400/- ఇస్తారు. విద్య అర్హత 10+2, డిప్లమా, B.Sc, GNM, DMLT, ఫార్మసీలో బ్యాచిలర్ డిగ్రీ. CEN-05/2026 కొత్త ఏకీకృత RRB వెబ్సైట్లో (https://rrb.indianrailways.gov.in/) అప్లోడ్ చేయబడుతుంది.

RRB Paramedical Recruitment CEN 05/2026 Full Notification Released for 590 Nursing Superintendent, Pharmacist & Lab Assistant Gr II Posts2026 Overview
సంస్థ పేరు :: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB)లో పారా-మెడికల్ లో
పోస్ట్ పేరు :: నర్సింగ్ సూపరింటెండెంట్, డయాలసిస్ టెక్నీషియన్, ఆరోగ్య మరియు మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ II, ఆడియాలజిస్ట్ & స్పీచ్ థెరపిస్ట్, ఫార్మసిస్ట్ (ప్రారంభ గ్రేడ్), రేడియోగ్రాఫర్ ఎక్స్-రే టెక్నీషియన్, ECG టెక్నీషియన్, ఆప్టోమెట్రిస్ట్ & ల్యాబ్ అసిస్టెంట్ Gr. II
మొత్తం పోస్టుల సంఖ్య :: 590
రిక్రూట్మెంట్ విధానం :: పర్మనెంట్ జాబ్స్
వయోపరిమితి :: 18-40 సం||రాలు
విద్య అర్హత :: 10+2, B.Sc & డిప్లమా
నెల జీతం :: రూ.21,700/- రూ.1,42,400/-
దరఖాస్తు ప్రారంభం :: 15.09.2026
దరఖాస్తుచివరి తేదీ :: 14.10.2026
అప్లికేషన్ మోడ్ :: https://rrb.indianrailways.gov.in/
పోస్టుల వివరాలు:
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB)లో పారా-మెడికల్ లో 590 ఖాళీలు ఉన్నాయి.
• నర్సింగ్ సూపరింటెండెంట్ :: 365
• డయాలసిస్ టెక్నీషియన్ :: 01
• ఆరోగ్య మరియు మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ II :: 43
• ఆడియాలజిస్ట్ & స్పీచ్ థెరపిస్ట్ :: 01
• ఫార్మసిస్ట్ (ప్రారంభ గ్రేడ్) :: 118
• రేడియోగ్రాఫర్ ఎక్స్-రే టెక్నీషియన్ :: 25
• ECG టెక్నీషియన్ :: 04
• ఆప్టోమెట్రిస్ట్ :: 02
• ల్యాబ్ అసిస్టెంట్ Gr. II :: 31
• మొత్తం పోస్టులు : 590

అర్హతలు:
• నర్సింగ్ సూపరింటెండెంట్ :: ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ చేత గుర్తింపు పొందిన నర్సింగ్ పాఠశాల లేదా ఇతర సంస్థ నుండి జనరల్ నర్సింగ్ మరియు మిడ్‌వైఫరీలో 3 సంవత్సరాల కోర్సు ఉత్తీర్ణులై రిజిస్టర్డ్ నర్స్ మరియు మిడ్‌వైఫ్‌గా సర్టిఫికేట్ పొంది ఉండాలి లేదా బి.ఎస్.సి నర్సింగ్ చేసి ఉండాలి.
• డయాలసిస్ టెక్నీషియన్ :: బి.ఎస్.సి. తో పాటు (ఎ) హీమోడయాలసిస్లో డిప్లొమా (లేదా) (బి) ప్రతిష్టాత్మక సంస్థలో హీమోడయాలసిస్ పనిలో రెండు సంవత్సరాల సంతృప్తికరమైన ఇన్-హౌస్ శిక్షణ / అనుభవం (రుజువు జతచేయాలి).
• ఆరోగ్య మరియు మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ II :: కోర్సు చేసేటప్పుడు కెమిస్ట్రీలోని ఏదైనా బ్రాంచ్‌లో కెమిస్ట్రీని ప్రధాన / ఐచ్ఛిక సబ్జెక్టుగా చదివి బి.ఎస్.సి. పట్టా. అదనంగా (ఎ) ఒక సంవత్సరం హెల్త్ / శానిటరీ ఇన్స్పెక్టర్ డిప్లొమా లేదా (బి) భారత ప్రభుత్వం, కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీకి చెందిన నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ వారిచే ప్రదానం చేయబడిన హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్లో ఒక సంవత్సరం నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ (NTC).
• ఆడియాలజిస్ట్ & స్పీచ్ థెరపిస్ట్ :: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఆడియాలజీ, స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ (BASLP)లో బ్యాచిలర్ డిగ్రీ మరియు రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (RCI)లో తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలి.

• ఫార్మసిస్ట్ (ప్రారంభ గ్రేడ్) :: రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి ఫార్మసీలో బ్యాచిలర్ డిగ్రీ (అల్లోపతిక్) మరియు ఫార్మసీ చట్టం, 1948 ప్రకారం ఫార్మసిస్ట్‌గా నమోదు చేయబడి ఉండాలి.
• రేడియోగ్రాఫర్ ఎక్స్-రే టెక్నీషియన్ :: గుర్తింపు పొందిన సంస్థ నుండి ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీతో 10+2 మరియు రేడియోగ్రఫీ / ఎక్స్-రే టెక్నీషియన్ / రేడియోడయాగ్నోసిస్ టెక్నాలజీలో డిప్లొమా (2 సంవత్సరాల కోర్సు). రేడియోగ్రఫీ / ఎక్స్-రే టెక్నీషియన్ / రేడియోడయాగ్నోసిస్ టెక్నాలజీలో డిప్లొమా (2 సంవత్సరాల కోర్సు) ఉన్న సైన్స్ గ్రాడ్యుయేట్లకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
• ECG టెక్నీషియన్ :: 10+2 / సైన్స్‌లో గ్రాడ్యుయేషన్‌తో పాటు, ప్రతిష్టాత్మక సంస్థ నుండి ECG ల్యాబొరేటరీ టెక్నాలజీ / కార్డియాలజీ / కార్డియాలజీ టెక్నీషియన్ / కార్డియాలజీ టెక్నిక్స్‌లో సర్టిఫికేట్/డిప్లొమా/డిగ్రీ పొంది ఉండాలి.
• ఆప్టోమెట్రిస్ట్ :: ఆప్టోమెట్రీలో బి.ఎస్.సి. లేదా ఆప్తాల్మిక్ టెక్నీషియన్లో డిప్లొమా (కోర్సు 3 నుండి 4 సంవత్సరాల వ్యవధి గలదై ఉండాలి). అభ్యర్థి సంబంధిత కౌన్సిల్/లైసెన్సింగ్ సంస్థ వద్ద రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.
• ల్యాబ్ అసిస్టెంట్ Gr. II :: సైన్స్‌లో 12వ తరగతి (10+2 దశ) మరియు (ఎ) డిప్లొమా ఇన్ మెడికల్ లేబొరేటరీ టెక్నాలజీ (DMLT) (లేదా) (బి) డిప్లొమా ఇన్ మెడికల్ లేబొరేటరీ టెక్నాలజీ (DMLT)కి సమానమైన మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో సర్టిఫికేట్ కోర్సు.

నెల జీతం
• నర్సింగ్ సూపరింటెండెంట్ :: రూ₹44,900 to ₹1,42,400/-
• డయాలసిస్ టెక్నీషియన్, ఆరోగ్య మరియు మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ II & ఆడియాలజిస్ట్ & స్పీచ్ థెరపిస్ట్ :: రూ. ₹35,400/- to ₹1,12,400/-
• ఫార్మసిస్ట్ (ప్రారంభ గ్రేడ్) & రేడియోగ్రాఫర్ ఎక్స్-రే టెక్నీషియన్ :: రూ.₹29,200/- to ₹92,300/-
• ECG టెక్నీషియన్ & ఆప్టోమెట్రిస్ట్ :: రూ.₹25,500/- to ₹81,100/-
• ల్యాబ్ అసిస్టెంట్ Gr. II :: రూ.₹21,700/- to ₹69,100/-
వయో పరిమితి:
• కనీస వయసు: 18 సంవత్సరాలు
• గరిష్ట వయసు: 40 సంవత్సరాలు
• 01.01.2027 నాటికి 18 నుండి 33, 40 సంవత్సరాలు మధ్య వయస్సు ఉడాలి. పోస్టులు ఎస్సీ/ఎస్టీ వర్గాలకు రిజర్వ్ చేయబడి ఉంటే, ఆ వర్గాలకు చెందిన దరఖాస్తుదారులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ వర్గానికి చెందిన దరఖాస్తుదారులకు 3 సంవత్సరాల వయో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు:
• ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్జెండర్లు, మైనారిటీలు లేదా ఆర్థికంగా వెనుకబడిన తరగతి (EBC)* వర్గాలకు చెందిన అభ్యర్థుల కోసం ₹250/- మరియు మిగిలిన అభ్యర్థులకు ₹500/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.

ఎలా దరఖాస్తు చేయాలి:
ఏవైనా అదనపు సమాచారం/నవీకరణలు/సవరణలు కేవలం RRB వెబ్సైట్లో మాత్రమే ప్రచురించబడతాయి. అభ్యర్థులు తాజా సమాచారం కోసం RRB వెబ్సైట్ https://rrb.indianrailways.gov.in/ ను క్రమం తప్పకుండా సందర్శించాలి.
ఎంపిక విధానం:
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ + నైపుణ్య పరీక్ష (శారీరక సామర్థ్య పరీక్ష) + వివరణాత్మక వైద్య పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు
•ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 15.09.2026
•ఆన్లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ : 14.10.2026 (23:59 గంటలు)

ముఖ్యమైన లింకులు:
🛑Full Notification Pdf Click Here
🛑Apply Online Link Click Here
🛑Official Website Click Here

