8వ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. NMMS నోటిఫికేషన్ విడుదల అర్హత దరఖాస్తు విధానం పూర్తి వివరాలు
AP NMMS Scholarship 2026 eligibility, age, all details 2026 in Telugu : ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు శుభవార్త.. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్స్ (NMMS) 2026 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం ఈ కాలర్షిప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ కాలర్ షిప్ లో సెలెక్ట్ అయితే 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ పూర్తి అయ్యేంతవరకు సంవత్సరానికి ₹12,000/- చొప్పున నాలుగు సంవత్సరాల పాటు మొత్తం ₹48,000/- కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతుంది. ఈ పరీక్ష ఎప్పుడు జరుగుతుంది ఎవరు అర్హులు ఎలా అప్లై చేసుకోవాలి పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం..

NMMS పరీక్ష ఎప్పుడు ఎక్కడ జరుగుతుంది : ఇందుకుగాను పరీక్ష 15 నవంబర్ 2026 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 వరకు 3 గంటల పాటు జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాలలో రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో ఈ పరీక్ష జరుగుతుంది. పరీక్ష తెలుగు ఇంగ్లీష్ మరియు ఉర్దూలో ఉంటుంది.
ఎవరు అర్హులు : ఈ పరీక్ష రాయడానికి గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 8వ తరగతి చదువుతున్న వాళ్ళు అర్హులు. 2025 -26 సంవత్సరంలో 7వ తరగతి వార్షిక పరీక్షలు ఓసి బిసి అభ్యర్థులకు కనీసం 55% ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు కనీసం 50% మార్క్స్ సాధించి ఉండాలి.
ఏ పాఠశాల విద్యార్థులు ఇందుకు అర్హులు : ప్రభుత్వ పాఠశాలలు, స్థానిక జడ్పీ/ మునిసిపల్ స్కూల్స్, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు, ఏపీ మోడల్ స్కూల్స్ చదువుతున్న విద్యార్థులు అర్హులు మరిన్ని వివరాల కోసం నోటిఫికేషన్లు చెక్ చేసుకోండి.
తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పరిమితి : తల్లిదండ్రుల ఇద్దరి వార్షిక ఆదాయం అన్ని వర్గాల ద్వారా కలిపి 3 లక్షల 50 వేల లోపు మాత్రమే ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికెట్ తాసిల్దార్ (MRO) నుంచి జారీ చేసి ఉండాలి అది కూడా ఒరిజినల్ అయి ఉండాలి.
పాఠశాల ప్రధానోపాధ్యాయులకు (HC) విద్యార్థులు క్రింద సర్టిఫికెట్లు అందజేయాలి
1. కుల ధ్రువీకరణ పత్రం.
2. ఆదాయ ధ్రువీకరణ పత్రం
3. ఏడవ తరగతి మార్క్ షీట్ జాబితా
4. పాస్ పోర్ట్ సైజ్ ఫోటో & సంతకం
పరీక్ష ఫీజు వివరాలు
ఓసి మరియు బీసీ విద్యార్థులకు రూ.100/- ఎస్సీ మరియు ఎస్టీ విద్యార్థులకు రూ.50/- రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ : 11-09-2026
•చెల్లింపు చేయవచ్చు : 11-09-2026
•సంబంధిత ప్రధానోపాధ్యాయులు అభ్యర్థి దరఖాస్తును అప్‌లోడ్ చేయడానికి చివరి తేదీ :: 12-10-2026
•ఫీజు చెల్లింపునకు చివరి తేదీ :: 13-10-2026
•ముద్రించిన నామినల్ రోల్స్‌ను ఇతర అనుబంధ పత్రాలతో పాటుగా సంబంధిత జిల్లా విద్యాధికార కార్యాలయంలో (ప్రధానోపాధ్యాయులు / ప్రిన్సిపాల్స్) సమర్పించడానికి చివరి తేదీ :: 14-10-2026
•డిఇఓ స్థాయిలో దరఖాస్తుల ఆమోదానికి చివరి తేదీ :: 16-10-2026
దరఖాస్తు విధానం : ఈ పరీక్షకు విద్యార్థులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు (HC) ద్వారా అధికార వెబ్సైట్ నందు https://portal.bseap.org/ ఆన్లైన్ లో దరఖాస్తు సమర్పించుకోవాలి.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here

