AP NTR Bharosa Pension Status 2026 : కొత్త పెన్షన్ స్టేటస్.. ఇలా చెక్ చేసుకోండి

AP NTR Bharosa Pension Status 2026 : కొత్త పెన్షన్ స్టేటస్.. ఇలా చెక్ చేసుకోండి

AP NTR Bharosa Pension Status Check 2026 : ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం అందిస్తున్న సామాజిక భద్రత పెన్షన్ కి మరో శుభవార్త.. అప్లై చేసుకున్న పెన్షన్ దారుల కోసం అప్లికేషన్ స్టేటస్ 2 నిమిషాలలో మొబైల్ లోనే తెలుసుకోవచ్చు. అలాగే కొత్త పెన్షన్ లో నిబంధనలు మార్చారు పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) ద్వారా అమలవుతున్న పథకం రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల పై గల లబ్ధిదారులు ప్రతినెల ఒకటో తేదీ ఆర్థిక సహాయం అందుతున్నారు. ఇందులో ముఖ్యంగా వృద్ధులు వితంతులు దివ్యాంగులు మరియు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఈ పథకం గొప్ప ఆర్థిక సహాయం అందిస్తుంది. ప్రతి నెల గ్రామ సవార్డు సచివాలయం ద్వారా సరికొత్త ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియ పారదర్శంగా నిర్వహిస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఎటువంటి లంచం లేకుండా ఎవరి సిఫార్సు అవసరం లేకుండా నేరుగా ఇంటికి వద్దకి వచ్చి కూటమి ప్రభుత్వం ద్వారా ప్రతి ఒక్క నెల పెన్షన్ పొందుతున్నారు. వృద్ధుల వితంతువులు పెన్షన్ రూ.4000/- దివ్యాంగులు కు రూ.6000/- పూర్తిగా వైకల్యం కలిగిన అభ్యర్థులకు రూ. 10,000/- అలాగే పూర్తిగా మంచానికి పరిమితమైన వారికి 15000 వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు.

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందడానికి దరఖాస్తుదారులకు ప్రభుత్వం అర్హత చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాలలో నెలకు ₹10,000/- పట్టణ ప్రాంతాల్లో నెలకు ₹12,000/- మించి ఆదాయం ఉండకూడదు. కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు మరియు ఇన్కమ్ టాక్స్ చెల్లింపుదారులై ఉండకూడదు. అలాగే ఫోర్ వీలర్ వాహనము కలిగి ఉండకూడదు. అయితే టాక్సీ, ఆటో మరియు ట్రాక్టర్ నడిపే కార్మికులకు మినహాయింపు ఉంటుంది. భూమి పరిమితి విషయానికొస్తే మూడు ఎకరాలు మాగాన్ని లేదా 10 ఎకరాలు మిట్ట భూమి మించి ఉండరాదు పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగు మించి నివాస స్థలం ఉండకూడదు అలాగే నెలకు 300 యూనిట్లు మించి విద్యుత్ వినియోగించి ఉండకూడదు. ప్రతి పెన్షన్ కేటగిరీకి ప్రభుత్వం ప్రత్యేక వయోపరిమితి వృద్ధాప్య పెన్షన్ కోసం తప్పనిసరిగా 60 సంవత్సరాలు నిండి ఉండాలి. ఒంటరి మహిళ పెన్షన్ కోసం గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలకు 35 ఏళ్లు పట్టణ ప్రాంతాల్లో మహిళలకు 30 సంవత్సరాలు ఉండాలి. భర్త నుంచి కనీసం ఒక సంవత్సరం పాటు విడిపోయి జీవిస్తున్న సరైన ఆదాయం ఉండకుండా ఉండాలి. చేనేత కార్మికులు మరియు కళ్ళు కార్మికులకు 50 సంవత్సరాలు మించి వయసు కలిగిన అభ్యర్థులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దివ్యాంగులు మరియు దీర్ఘకాలికి వ్యాధిగ్రస్తులు ఎలాంటి వయోపరిమితి లేకుండా అవసరమైన ధృవీకరణ పత్రాలు ఉంటే సరిపోతుంది.

కొత్త పెన్షన్ దరఖాస్తు కోసం లేదా ఆన్లైన్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవడానికి అవసరమైన ధ్రువీకరణ పత్రాలు ఈ క్రింద విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ మూడు డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు,  రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికెట్ అందరూ కూడా కలిగి ఉండాలి. వికలాంగుల అయితే సదరం సర్టిఫికెట్, వితంతువు అయితే భర్త మరణించిన ధ్రువీకరణ పత్రం, ఒంటరి మహిళ అయితే తాసిల్దార్ నుంచి సర్టిఫికెట్, చేనేత కల్లుగీత సంబంధిత వృత్తికి గుర్తింపు కార్డు, ఆధార్ కార్డ్ తో లింక్ ఉన్న మొబైల్ నెంబర్ తదితర డాక్యుమెంట్స్ తీసుకెళ్లినట్లయితే ఈజీగా అప్లికేషన్ చేసుకోవచ్చు.

మీ ఇంటి వద్ద కూర్చొని మీ మొబైల్ ద్వారా మీ పెన్షన్ స్టేటస్ ఈ క్రింద విధంగా తెలుసుకోవచ్చు. అందుకుగాను ముందుగా అభ్యర్థులు https://apseva.ap.gov.in ఈ వెబ్ సైట్ ని ఓపెన్ చేయండి. ఇందులో దరఖాస్తుదారుని యొక్క ఆధార్ నెంబర్ లేదా అప్లికేషన్ నెంబరు సబ్మిట్ చేసి స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. అందులో ముందుగా సెక్రటేరియట్ వెరిఫికేషన్, ఆ తర్వాత ఎంపీడీవో అప్రూవల్ & మండల పరిషద్ డెవలప్మెంట్ ఆఫీసర్ అప్రూవల్ ద్వారా ఫైనల్ గా మీరు పెన్షన్ పొందవచ్చు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *