PMAY Urban 2.0 | కేంద్ర ప్రభుత్వం మీ ఇంటి నిర్మాణం కోసం 1,80,000 ఇస్తున్నారు.. త్వరపడండి
PMAY Urban 2.0 Housing Scheme 1.8 lakh : పట్టణ ప్రాంతాలలో ఇల్లు లేని పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఇళ్లు నిర్మించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 (PMAY U 2.0) పథకాన్ని అమలు చేస్తుంది.

పట్టణ ప్రాంతాలలో ఇల్లు లేని, పేద మరియు మధ్య తరగతి కుటుంబాలకు చిరకాల ఇళ్లు నిర్మించుకోవాలని ఆశను కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2 (PMAY U 2.0) పథకం ద్వారా అమలు చేస్తుంది. సొంత ఇల్లు నిర్మించుకోవాలని అభ్యర్థులకు చక్కటి భరోసా కల్పిస్తుంది. దాదాపుగా కోటి కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మించడమే లక్ష్యంగా రూ.10 లక్షల కోట్ల భారీ బడ్జెట్ తో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుంది. కేంద్ర ప్రభుత్వం నేరుగా రూ.2.30 లక్షల కోట్ల ఆర్థిక సహాయం అందజేయనున్నది.
పట్టణ ప్రాంతాలలో సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి తగినంత డబ్బు లేకపోవడంతో ఈ పథకం ద్వారా రూ 1.50 లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందిస్తారు. ఒకవేళ అసలు స్థలమే లేకపోతే ఆందోళన చందనవసరం లేదు. ప్రభుత్వ ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్య సమస్త తో కలిసి చౌకైన ఇళ్లను నిర్మిస్తుంది. ఈ మూడల్ లో ఆర్థిక వెనుకబడిన కుటుంబాలకు ఒక ఇంటికి రూ. 1.5 లక్ష వరకు కేంద్ర సహాయం అందిస్తుంది. సొంత ఇల్లు కొనుక్కోవడానికి హోమ్ లోన్ కూడా అవకాశం కల్పిస్తూ సబ్సిడీతో రూ. 8లక్షల వరకు పొందే హోమ్ లోన్ పై ఏడాదికి 4% శాతం వడ్డీ రాయితీ ఇస్తుంది. దీని ద్వారా గరిష్టంగా రూ.1.8 లక్ష వరకు ఆర్థిక లబ్ధి పొందవచ్చు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 అర్హతలు చూసుకున్నట్లయితే కుటుంబం యొక్క వార్షిక ఆదాయం రూ.3 లక్షల వరకు కుటుంబం తొలి కేటగిరీలో ఉండగా, రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు వార్షికోత్సవం రెండవ కేటగిరి వస్తుంది . అలానే రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు మూడో కేటగి కిందికి వస్తుంది.

