AP New pension status : ఏపీలో కొత్త పెన్షన్లు స్టేటస్ మొబైల్ లో ఇలా చెక్ చేసుకోండి
New NTR Bharosa Pension Status 2026 Check Online : ఆంధ్రప్రదేశ్ లో కొత్త పెన్షన్ దరఖాస్తు స్వీకరణ కొనసాగుతుంది. అప్లికేషన్ వెరిఫికేషన్.. అప్లై చేసిన వారికి స్టేటస్ ఎలా అనేది తెలుసుకుందాం..
ఆంధ్రప్రదేశ్ లో కొత్త పెన్షన్ కి ఇంకా రెండు రోజులు మాత్రమే ఛాన్స్.. సెప్టెంబర్ 7 నుంచి అప్లికేషన్ మొదలు కాగా సెప్టెంబర్ 16 వరకు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటివరకు 6.81 లక్షల మంది అప్లికేషన్ చేసుకున్నారు. ఇందులో ఇందులో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులతో సహా వివిధ వర్గాల వారీగా ప్రభుత్వం ఈ అవకాశం కల్పిస్తుంది. వాటిని పరిశీలించి అర్హత నిర్ధారించాక కొత్త పెన్షన్ మంజూరు చేస్తారు.

ఆంధ్రప్రదేశ్ లో లక్షలాదిమంది నెలాఖరి ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా వృద్ధులకు, దివ్యాంగులకు & వితంతువులకు ప్రతినెల మొదటి తేదీ డబ్బులు ఖాతాలోచమవుతుంటాయి. దీనికి సంబంధించి చాలా మందికి తమ దరఖాస్తు ఏ దశలో ఉందో డబ్బులు పడతాయో లేదా అనేది స్పష్టత లేకపోవడం జరిగింది. దానికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయం దూరం ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఎటువంటి లంచాలు లేకుండా సిపార్ట్స్ అవసరం లేకుండా నేరుగా బ్యాంకు ఖాతాలు డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా నిధులు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో వివిధ వర్గాలు వేరువేరు మొత్తాలలో పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో వృద్ధులు, వితంతులు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్ జెండర్లు వర్గాలకు చెందిన వారికి నెలకు ₹4,000/- ఆర్థిక సహాయం అందిస్తారు. మరియు 40% నుంచి 79% మధ్య వైకల్యం కలిగిన అభ్యర్థులకు 6000 నుంచి రూ.10,000/- మధ్యలో పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. దీర్ఘ కాలిక మంచానికి పరిమితమైన అభ్యర్థులకు రూ.15,000/- ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది.
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అర్హత కోసం కుటుంబం ఆదాయం గ్రామీణ ప్రాంతాలకు నెలకు ₹10 వేలు, పట్టణ ప్రాంతాల్లో ₹12,000/- లోపల ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు. ఆదాయ పన్ను చెల్లించకుండా ఉండాలి. భూమి మగాన్ని 3 ఎకరాల్లోపు, మిట్ట భూమి 10 ఎకరాల లోపు ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగులు మించి నివాస స్థలము ఉండకూడదు. తప్పు సమాచారం ఇస్తే దరఖాస్తు శాశ్వతంగా రద్దు చేయడం జరుగుతుంది.
వయసు వృద్ధాప్యం పెన్షన్ కోసం 60 సంవత్సరాల తప్పకుండా ఉండాలి. ఒంటరి మహిళలు గ్రామాలలో 35 సంవత్సరాలు పట్టణాలలో 30 సంవత్సరాలు లోపు వయసు ఉండాలి. చేనేత కళ్ళు గీత కార్మికులకు 50 సంవత్సరాలు గురించి ఉండాలి. దివ్యాంగులకు దీర్ఘకాలిక రోగులకు ఎటువంటి వయోపరిమితి అవసరం లేదు. 40% కన్నా ఎక్కువ వైకల్యం కలిగిన అభ్యర్థులు వయసుతో సంబంధం లేకుండా అప్లై చేసుకోవచ్చు.
కొత్త పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు & ఇన్కమ్ సర్టిఫికెట్ ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఉండాలి. వితంతువులు భర్త మరణ ధ్రువీకరణ పత్రం, ఒంటరి మహిళలు విడిగా ఉన్నట్టు తాసిల్దార్ నుంచి సర్టిఫికెట్ తీసుకొని స్వర్ణ గ్రామం వార్డు సచివాలయం కి వెళ్ళినట్లయితే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న అభ్యర్థులు తమ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా ఇప్పుడు నేను చెప్తాను అలా మీరు చెక్ చేసుకోవచ్చు.

కొత్త పెన్షన్ అప్లై చేసుకున్న అభ్యర్థులు స్టేటస్ చెక్ చేసుకోవడం చాలా సులభం. మీ దరఖాస్తు (21) రోజులలో పరిశీలించబడుతుంది. మీరు ఈ లింక్లో మీ దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చు. ముందుగా అభ్యర్థులు https://apseva.ap.gov.in/ వెబ్ సైట్ ని ఓపెన్ చేయండి. అందులో అప్లికేషన్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ తో అప్లికేషన్ స్టేటస్ మరియు పేమెంట్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ ద్వారా అప్లికేషన్ ఫిల్ అప్ చేసి ఈ కేవైసీ పూర్తి చేసి NPCI మ్యాపింగ్ చేసిన వెంటనే అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఇందులో దరఖాస్తుదారులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ సీడింగ్, బ్యాంక్ పాస్ బుక్ & సదన్ సర్టిఫికెట్ అన్నిట్లో కూడా పేరు ఒకేలాగా ఉండేట్టుగా చూసుకోవాలి.

