AP లో 10,060 ప్రభుత్వ ఉద్యోగాలు సెప్టెంబర్, అక్టోబర్ జాబ్ నోటిఫికేషన్లు | AP Government 2026 Latest News
AP Government 2026 10060 vacancy Latest News : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు భారీ శుభవార్త తెలియజేశారు.. సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలో 10,060 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో 10,060 పోస్టులు భర్తీపై మంత్రుల బృందంతో మంత్రి లోకేష్ గారు వర్చువల్ గా సమీక్షించారు. మొదటి దశలో 1523 అధ్యాపక పోస్టులు భర్తీ చేయనున్నారు. రెండో దశలో 3168 పోస్టులకు సెప్టెంబర్లో 15న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మూడో దశలో 2,388 నాలుగో దశలో 2,981 పోస్టులు భర్తీకి అక్టోబర్ 15 నోటిఫికేషన్ ఇవ్వాలని లోకేష్ గారి ఆదేశాలు జారీ చేశారు. 3వ దశకు సంబంధించి పోస్టులు 2,225 హోం శాఖలో ఖాళీలు వివరాలను ఆగస్టు 6న క్యాబినెట్లో ముందు ఉంచునన్నారు.
ఆంధ్రప్రదేశ్లో జాబ్ కేలండర్ 2026 మంత్రి లోకేష్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జాబ్ కేలండర్ నాలుగు దశలలో 10,060 ప్రభుత్వ ఉద్యోగుల భర్తీ చేయాలని తెలిపారు. రెండో దశ కింద వివిధ శాఖలలో 3,168 పోస్టుల భర్తీ సెప్టెంబర్ 15 నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. మూడు నాలుగు దశలలో 5,369 ఉద్యోగుల భర్తీకి ఒకేసారి అక్టోబర్ 15 నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. అలాగే గ్రూప్ అండ్ పోస్ట్లు సంబంధించి పెంచాలని అధికారికంగా ఆదేశాలు జారీ చేశారు లోకేష్ గారు.


