Ration Card : 2 నిమిషాల్లో మీ మొబైల్ లో e-KYC పూర్తయిందా! లేదా?తెలుసుకోండి…ఆగస్టు నెల నుంచి రేషన్ లో భారీ మార్పులు..
Ration Card e-KYC Completed or Not? Ration Card August new rules : రేషన్ కార్డు ఉన్న తెలుగు రాష్ట్ర ప్రజలకు భారీ శుభవార్త.. నిరంతరము ఉచిత రేషన్ పొందాలి అనుకుంటే లబ్ధిదారులకు తప్పనిసరిగా… 2 నిమిషాల్లో మీ మొబైల్ లోe-KYC పూర్తయిందా లేదా? తెలుసుకోండి.

రేషన్ కార్డు లబ్ధిదారులు ప్రభుత్వ కీలక సూచనలు జారీ చేశారు, ఉచిత రేషన్ బియ్యం నిరంతరం పొందాలనుకున్న ప్రతి ఒక్క అభ్యర్థి తప్పనిసరిగా జూలై 31 లోపు ఈ కేవైసీ పూర్తి చేయాలని స్పష్టత తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయిందో లేదో తెలుసుకోవడానికి ఇంకా నుంచి రేషన్ కార్డు దుకాణాలకు లేదా ప్రభుత్వ కార్యాలయం అవసరం లేదు. తమ మొబైల్ ద్వారా నిమిషం వ్యవధిలో రేషన్ కార్డు ఈ కేవైసీ స్టేటస్ సులువుగా చెక్ చేసుకోవచ్చు. ఈ e-KYC ముఖ్యంగా నకిలీ మరియు అనర్హులను గుర్తించి రేషన్ కార్డుతో ఆధార్ అనుసంధానం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి కుటుంబ సభ్యులు e-KYC తప్పనిసరిగా పూర్తి చేయాలని పౌరసరపర శాఖ ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తులో రేషన్ బియ్యం నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు ఈ కేవైసీ చేయకపోతే. ఈ e-KYC మీరు మీ సేవ కేంద్రంలో లేదా రేషన్ డీలర్ వద్ద ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళినట్లయితే మీ వేలు ముద్ర వేసి బయోమెట్రిక్ చేస్తారు దాంతో ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు అనుసంధానమై మీకు భవిష్యత్తులో ఉచిత బియ్యము పొందడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందని పౌరసరఫరా శాఖ స్పష్టత తెలియజేశారు.
ఇకపై రేషన్ బియ్యం కంపెనీలో కూడా కేంద్ర ప్రభుత్వం కొత్త నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆగస్టు, సెప్టెంబర్ & అక్టోబర్ నెలలకు సంబంధించి రేషన్ ఒకేసారి పంపిణీ చేయాలని పౌరసరపర శాఖ నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ప్రతి వ్యక్తికి నెలకు 6 కిలోల బియ్యం అందిస్తున్నారు మూడు నెలలకు 18 కిలోల బియ్యం ఒకేసారి అందుబాటులో వస్తుంది. అలాగే తెలంగాణ ప్రభుత్వం క్యూఆర్ కోడ్ తో కూడిన కొత్త రేషన్ కార్డులు పంపిణీకి సర్వసిద్ధం చేశారు. ఈ కేవైసీ చేయని అభ్యర్థులకు స్మార్ట్ కార్డు పంపిణీ చేయడం నిలిపివేసి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం స్టీమ్ రైస్ చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేసేందుకు కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు.
రేషన్ కార్డులు మీ మొబైల్ లోనే ఈ కెవిసి స్టేటస్ ఎలా చెక్ చేసుకోవడం ఇప్పుడు తెలుసుకుందాం
•లబ్ధిదారులు ముందుగా ఆంధ్ర వాళ్లయితే https://aepos.ap.gov.in/ దీని పైన క్లిక్ చేయండి తెలంగాణ వాళ్లయితే https://smartpds.telangana.gov.in/ వెబ్ సైట్ ని ఓపెన్ చేయండి.
• అందులో హోమ్ పేజీలో లెఫ్ట్ సైడ్ లో Beneficiary Details పైన క్లిక్ చేయండి.
•RC No & క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
•అందులో మీ స్టేటస్ అనేది కనబడుతుంది. అందులో Verified – Aadhar Card last 4 digit కనిపిస్తే ఈ కేవైసీ కంప్లీట్ అయినట్టు అర్థం.


