TG Police Jobs : తెలంగాణ కానిస్టేబుల్ వయోపరిమితి మరో మూడేళ్లు పెంపు | పూర్తి వివరాలు ఇవే
Telangana police department 2026 Age limit increased for Constable jobs : తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త.. రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్, తత్సమాన పోస్టుల (పీసీ డ్రైవర్లు మినహా) ఏజ్ లిమిట్ను ప్రభుత్వం మరో 3 సంవత్సరాలు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణలో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకి అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకు కనీస వయసు 18 సంవత్సరాలు ఉండగా ప్రభుత్వం తాజా ఉత్తర్వులు ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు గరిష్ట వయసు 34+3 మొత్తం 37 సంవత్సరాలు పెంచింది. జనరల్ అభ్యర్థులకు తాజా పెంపుతో 32 ఏళ్ల వయసు వరకు అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే ఎస్సై ఉద్యోగులకు జనరల్ అభ్యర్థులకు 32 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ/బీసీ/EWS అభ్యర్థులకు 37 ఏళ్లుగా ఉంటుంది. పోలీసు, అగ్నిమాపక, జైళ్లు, SPF విభాగాల్లో అప్లై చేసే అభ్యర్థులకు లబ్ధి చేకూరనుంది.
సెప్టెంబర్ తొమ్మిదో తేదీన ముగించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ గడవు ప్రకటిస్తూ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సెప్టెంబర్ 16 సాయంత్రం 5 లోపు వరకు అవకాశం కల్పించింది. వయో పెంపు నిర్ణయంతో కొత్తగా వేలాదిమంది నిరుద్యోగులకు అవకాశం కల్పిస్తుందని సాంకేతిక ఇబ్బందులు లేకుండా ముగింపు తేదీ ముందే దరఖాస్తు పూర్తి చేసుకోవాలని ఈ గడువులోపు ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. అర్హులైన వారు వెంటనే అధికార వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోండి. మరిన్ని వివరాల కోసం అధికార వెబ్సైట్ ని https://www.tgprb.in/ విజిట్ చేయండి.


