AP వాట్సాప్ లో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల | Andhra Pradesh Intermediate Results Whatsapp Release 2025 Date
Andhra Pradesh Intermediate Results 2025 Date : ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు (BIEAP) ఈ సంవత్సరం ఇంటర్ ఫలితాలను వాట్సాప్ ద్వారా విద్యార్థులకు అందించే నూతన పద్ధతిని ప్రవేశపెట్టింది. ఈ సంవత్సరం ఇంటర్ పరీక్షలకు రెండు సంవత్సరాలు (1st మరియు 2nd ఇయర్) కలిపి 10 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఈ విధానం ప్రకారం, ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థుల లేదా వారి తల్లిదండ్రుల రిజిస్టర్డ్ ఫోన్ నంబర్లకు మార్కుల జాబితా PDF రూపంలో నేరుగా పంపబడుతుంది. ఈ ఏర్పాటు కోసం ఇప్పటికే ఇంటర్ బోర్డు వద్ద విద్యార్థుల ఫోన్ నంబర్లు సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయబడ్డాయి.

కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ విధానం ద్వారా ఇప్పటికే హాల్ టికెట్ల డౌన్‌లోడ్ సౌలభ్యం కల్పించబడింది. ఇప్పుడు ఫలితాల విడుదలలోనూ ఈ సేవలను వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. ఈ రెండు విధానాలు (వాట్సాప్ మరియు ఆన్‌లైన్) విద్యార్థుల సౌలభ్యం కోసం అందుబాటులో ఉంచారు.
ఫలితాలు వచ్చిన 20-30 నిమిషాల్లోనే విద్యార్థులకు వాట్సాప్ (9552300009) ద్వారా అందేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులు ఈ PDFని చూసుకుని, అవసరమైతే సమీపంలోని జిరాక్స్ సెంటర్‌లో ప్రింట్ తీసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. ఒకవేళ సాంకేతిక సమస్యల వల్ల వాట్సాప్ సందేశం ఆలస్యమైతే, విద్యార్థులు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ (bie.ap.gov.in)లో తమ రోల్ నంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి ఫలితాలను చూసుకోవచ్చు. ఈ రెండు విధానాల్లో విద్యార్థులు తమ సౌలభ్యం ప్రకారం ఎంచుకోవచ్చు.
ఈ సంవత్సరం ఇంటర్ పరీక్షలకు రెండు సంవత్సరాలు (1st మరియు 2nd ఇయర్) కలిపి 10 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలు మార్చి 17న ముగిసినప్పటికీ, జవాబు పత్రాల మూల్యాంకనం మార్చి 18 నుంచి ప్రారంభమైంది మరియు ఏప్రిల్ 10 వరకు కొనసాగనుంది. ఫలితాలను ఏప్రిల్ మూడో వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మూల్యాంకనం కోసం రాష్ట్రవ్యాప్తంగా 25 కేంద్రాలు ఏర్పాటు చేయగా, దాదాపు 20 వేల మంది సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు.
ఈ విధానంతో, ఆన్‌లైన్‌లో సర్వర్ సమస్యలు లేదా ఫలితాల కోసం ఎదురుచూడాల్సిన అవసరం విద్యార్థులకు తప్పనుంది. వాట్సాప్ (9552300009) ద్వారా ఫలితాలు అందడం వల్ల సమయం ఆదా కావడమే కాకుండా, సౌలభ్యంగా మార్కుల వివరాలను పొందే అవకాశం కలుగుతుంది.

🛑 More Details Results Click Here


🔥Inter Result Date 2025: ఇంటర్ విద్యార్ధులకు గుడ్ న్యూస్… TS intermediate Result 2025
🔥TATA లో DEO Govt ఉద్యోగాలు | TISS Notification 2025
🔥HPCL లో 63 జూనియర్ ఎగ్జిక్యూటివ్ Govt జాబ్స్ విడుదల | HPCL Notification 2025 | Latest Jobs In Telugu