రాత పరీక్ష లేకుండా 12th అర్హతతో అంగన్వాడిలో టీచర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Telangana Anganwadi Teacher Notification 2026
Telangana Anganwadi Teacher district wise job vacancy : తెలంగాణలో మహిళ శిశు దివ్యాంగుల మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ, పరిధిలో గల ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్టు, సిరిసిల్ల (43) మరియు ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్టు వేములవాడ (12) అంగన్ వాడీ టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీకై అర్హులైన ఇంటర్ పాసైన స్థానిక మహిళా అభ్యర్థినిల నుండి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు కోరడమైనది. ఖాళీలు, విద్యార్హత, రిజర్వేషన్ మరియు దరఖాస్తు చేయడము కొరకు https://mis.tgwdcw.in దరఖాస్తు తేదీ 28-07-2026 నుంచి 07-08-2026 సా. 5.00 వరకు ఆన్ లైన్ ద్వారా మాత్రమే స్వీకరించబడును. ఈ నోటిఫికేషనన్ను పూర్తిగా రద్దు పరచడానికి, మార్పులు చేర్పులు చేయడానికి పూర్తి అధికారము కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్/చైర్మన్, రాజన్న సిరిసిల్ల గారికి కలదు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మహిళా, పిల్లలు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ పరిధిలో గల ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు సిరిసిల్ల పరిధిలో (43) ఖాళీగా ఉన్న అంగన్ వాడి టీచర్ల పోస్టులు భర్తీ చేయడానికి అర్హులైన మహిళ అభ్యర్దినుల నుండి ఆన్ లైన్ దరఖాస్తులు కోరనైనది.
అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఉండవలసిన అర్హతలు:
>>విద్యార్హత: అభ్యర్థిని తప్పనిసరిగా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండవలయును.
>>వయస్సు: 01/07/2026 నాటికి 18 సంవత్సరముల నుండి 35 సంవత్సరముల లోపు ఉండాలి.
>>స్థానికత: దరఖాస్తు చేసుకోబోయే మహిళలు సంబంధిత అంగన్వాడీ కేంద్రానికి తప్పనిసరిగా స్థానిక వాస్తవ్యులై ఉండాలి. గ్రామీణ ప్రాంతానికి సదరు గ్రామ పంచాయతీకి, పట్టణ ప్రాంతానికి సంబంధిత వార్డ్ కు చెందిన వారై ఉండాలి.
>>ఎస్సీ/ఎస్టీ సబ్ ప్లాన్ కింద కేటాయించిన పోస్టులకు ఆయా హామ్లెట్ / ఆవాసం లేదా గ్రామపంచాయతీకి చెందిన వారు మాత్రమే అర్హులు.
>>నివాస ధృవీకరణ: తహసిల్దార్ గారిచే నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుండి ఒక సంవత్సరము లోపు తీసుకున్న నివాస ధ్రువీకరణ పత్రము తప్పనిసరిగా జతపర్చాలి.
🛑అభ్యర్ధుల ఎంపిక విధానం:
1. ఇంటర్మీడియట్ మార్కుల మెరిట్ నకు 70 మార్కులు.
2. ప్రత్యేక కేటగిరీలు: వితంతువులు 5 మార్కులు,
3. అనాథలు – 10 మార్కులు,
4. దివ్యాంగులు – 5 మార్కులు.
5. జిల్లా ఎంపిక కమిటీ ఇంటర్వ్యూ: 10 మార్కులు.
ఆన్లైన్లో అప్లోడ్ చేయవలసిన ధ్రువపత్రాలు (Scanned Copies)
1.పుట్టిన తేది ధృవీకరణపత్రము (SSC).
2.తహసిల్దార్ చే జారీ చేయబడిన కుల మరియు నివాస ధృవీకరణ పత్రములు ఇటీవల తీసుకున్నదై ఉండాలి
3.ఇంటర్ / ఆ పై విద్యార్హతల మార్కుల జాబితా(memo).
4.ఓటర్ ఐ.డి లేదా ఆధార్ కార్డ్ ఒక సంవత్సరం లోపు update చేసినది ఉండాలి.
5.ప్రత్యేక కేటగిరీ వర్తించే వారు (Special category) సదరం సర్టిఫికేట్ (దివ్యాంగులు), భర్త మరణ ధృవీకరణ పత్రము (వితంతువులు), లేదా అనాధ సర్టిఫికేట్.
గమనిక: కేవలం ఆన్ లైన్ https://mis.tgwdcw.in/ లో వచ్చిన దరఖాస్తులు మాత్రమే అనుమతించబడును. అభ్యర్ధులు యొక్క మ్యాన్యువల్ దరఖాస్తులను లేదా గతం లో ఇచ్చిన దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లో స్వీకరించబడవు.
దరఖాస్తుదారులు రశీదు భద్రపరచుకొని దృవీకరణ సమయం లో సమర్పించాలి.
ఈ నోటిఫికేషన్ ను పూర్తిగా రద్దు చేయుటకు లేదా నోటిఫికేషన్ సవరించుటకు లేదా నోటిఫికేషన్ లో మార్పులు చేయుటకు పోస్టుల సంఖ్య పెంచుటకు లేదా తగ్గించుటకు లేదా అవసరమైన ఇతర నిర్ణయాలు తీసుకొనుటకు శ్రీయుత జిల్లా కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్ / చైర్మన్, రాజన్న సిరిసిల్ల జిల్లా గారికి పూర్తి అధికారం కలదు. (కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్ / చైర్మన్, జిల్లా స్థాయి అంగన్ వాడీ నియామక కమిటీ, రాజన్న సిరిసిల్ల జిల్లా గారి తరపున, వారి అనుమతితో).
•దరఖాస్తు ప్రారంభం తేదీ : 28/07/2026
•దరఖాస్తు చివరి తేది: 07/08/2026 సాయంత్రము 5.00 గంటల వరకు
వెబ్ సైట్: దరఖాస్తులను https://mis.tgwdcw.in/ లో సమర్పించవలెను.

🛑Notification Pdf Click Here
🛑Vacancy Details Click Here
🛑Apply Online Link Click Here

