ఏపీ ప్రభుత్వ మరొక కీలక నిర్ణయం.. ఏపీలో వారసత్వ భూములకు రూ. 100కే భూముల రిజిస్ట్రేషన్.. ఆటో మ్యుటేషన్ | AP Varasatva bhoomi registration 2026
AP Varasatva bhoomi registration 2026 Latest News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వారసత్వ భూములు బదలాయింపు ప్రక్రియ చాలా సులువు చేయడానికి ఆటో మ్యుటేషన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ ప్రక్రియ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే రెవిన్యూ రికార్డుల ఆటో మ్యుటేషన్ అప్డేట్ అవుతుందని తెలిపారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరగడం అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపారు. అంతేకాకుండా 10 లక్షల లోపు విలువైన భూములు స్టాంపు డ్యూటీ కి కేవలం నూరు రూపాయలు నిర్ణయించి ప్రజల ఆర్థిక భారం కూడా తగ్గించారు. పూర్తి వివరాలకు వెళ్ళినట్లయితే..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారసత్వ భూముల పై గుడ్ న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వారసత్వ హక్కు బదలాయింపుల్లో చిన్న, మధ్య తరగతి భూముల వారసులు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఇప్పుడు మొదట సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత సంబంధిత వివరాలు ఆటోమేటిక్గా రెవిన్యూ వ్యవస్థలో అప్డేట్ అయ్యే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టారు. అలాగే 10 లక్షల లోపు విలువైన వారస భూములు స్టాంప్ డ్యూటీ కూడా నామ మాత్రం నూరు రూపాయలు మాత్రమే నిర్ణయించారు. ఇందుకుగాను వీలునామా లేకుండా వారస భూములు బదలాయింపు జరిగే సందర్భంలో రిజిస్ట్రేషన్ కి సంబంధించి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ (FMC) తప్పనిసరిగా సమర్పించాలని తెలిపారు. ఇందులో అవసరమైన వారసులను గుర్తించి ప్రక్రియ సులువుగా సులభతరం కానున్నది.
ఆంధ్రప్రదేశ్ లో వీలునామా రాయకుండా సబ్-రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో తాత, తండ్రి & తల్లి చనిపోతే ఆ వారసుల మాత్రమే ఆస్తులు పంపిణీ దరఖాస్తు రిజిస్ట్రేషన్ సమయంలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ పెట్టి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఆటో మ్యుటేషన్ ద్వారా రెవెన్యూ రికార్డుల్లో చేంజ్ అవుతుందని తెలిపారు.


