ఏపీ రాష్ట్రంలో అగస్ట్ 7న కొత్త పథకం.. అకౌంట్లోకి రూ.25వేలు.. అర్హతలివే.. ఇవే మార్గదర్శకాలు | Andhra Pradesh Nethanna Sevalo scheme 2026
Andhra Pradesh Nethanna Sevalo scheme 2026 GO Released Latest News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త సంక్షేమ పథకానికి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పథకం కింద దారిద్ర రేఖకు కింద ఉన్న ఒక కుటుంబానికి ఏడాదికి ఒకేసారి సంవత్సరానికి ₹25,000/- చొప్పున ఫ్యామిలీ పెద్దకు ఆర్థిక సహాయం అందజేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో వయసుతో సంబంధం లేకుండా చేనేత కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘నేతన్నల సేవలో’ పేరుతో కొత్త పథకం అమలు చేయడానికి బుధవారం జీవో 187 విడుదల చేశారు. ఒక కుటుంబంలో ఎన్ని మగ్గాలుఉన్నప్పటికీ ఒక చేనేత కుటుంబంలో ఏడాదికి ఒక ఒకేసారి కుటుంబ పెద్దల పేరుతో డైరెక్ట్ బ్యాంకు ఖాతాలో 25000 జమ చేస్తున్నారని తెలిపారు. ఈ పథకం కి సంబంధించి స్వర్ణ గ్రామ వార్డు కార్యాలయం ద్వారా లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసి అదే శాఖ ద్వారా అమలు చేయనున్నారు. అర్హత జాబితాను సామాజిక తనిఖీ కోసం జిల్లా కలెక్టర్ ఆదేశాలకు జాబితాలు సిద్ధం చేస్తారు ప్రస్తుతం లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 51,952 చేనేత కుటుంబాలు ఈ పథకాన్ని వర్తిస్తుందని తెలిపారు. చేనేత మగ్గం కలిగి కుటుంబంలో పెద్ద కు ఆర్థిక సహాయం అందుతుంది. ఎన్ని మగ్గాలు ఉన్నప్పటికీ ఒక చేనేత కుటుంబానికి ఏడాదికి 25000 చొప్పున ఆర్థిక సహాయం అందుతుంది. మీరు తప్పనిసరిగా దారిద్య రేఖకు దిగువన ఉండాలి. పూర్తి బాధ్యత స్వర్ణ, గ్రామ వార్డు సచివాలయ అధికారులు ఉంటుంది. ఎంపిక జాబితా త్వరలో సచివాలయంలో ప్రదర్శించడం జరుగుతుంది.
నేతన్న సేవ పథకం 2026-27 జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా ఆగస్టు 7న ప్రారంభిస్తున్నట్లు మంత్రి సవిత ప్రకటించారు. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి 25 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. సొంత మగ్గం కలిగిన చేనేత వృత్తిలో ఉన్న కార్మికులతో పాటు రాట్నం వడకడం, నూలుకు రంగులు అద్దడం వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. తప్పనిసరిగా బ్యాంకు అకౌంట్ కి ఆధార్ లింక్ అయి ఉండాలి, దాంతో పాటు NPCI మ్యాపింగ్ అయి ఉండాలి. అప్పుడే డైరెక్ట్ గా నేతన్న సేవ పథకం అందుతుంది. మరిన్ని వివరాల కోసం స్వర్ణ గ్రామ వార్డు సచివాలయ అధికారులను సంప్రదించండి.

ఆంధ్రప్రదేశ్ లో చేనేత సేవలో కింద సంవత్సరానికి 25000 అర్హతలు ఇవే
చేనేత కార్మికులకు ప్రభుత్వం నేతన్న సేవలో కింద సంవత్సరానికి రూ.25 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నారు. కార్మికుల వయసు, మగ్గాల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రస్తుతం నేత వృత్తిలో ఉన్న వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు మార్గదర్శకాలు జారీ చేశారు. ఒక కుటుంబానికి ఏడాదికి ఒకేసారి ఆర్థిక లబ్ధి వర్తిస్తుంది. కుటుంబం దారిద్య రేఖకు దిగువ దిగున ఉండాలి. ఫ్యామిలీలో పెద్దకు సహాయం అందిస్తుంది. దీనికి సంబంధించి స్వర్ణ, గ్రామ వార్డు సచివాలయం అధికారులు అర్హత జాబితా ఎంపిక చేయనున్నారు.

