AP School Holidays 2026 : ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ నెల 31న, ఆగష్టు 1న ఆ స్కూళ్లకు & కళాశాలలు సెలవు.. కీలక ప్రకటన
AP School & Colleges Holidays 2026 : ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులకు ఎగిరి గంతేసే మరో శుభవార్త.. జూలై 31 & ఆగస్టు 1న ఆ రెండు రోజులు ఆ స్కూల్ మరియు కళాశాలలు సెలవు.. కారణం.. పూర్తి వివరాలు తెలుసుకుందాం..

ఆంధ్రప్రదేశ్ లో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 01 ఆగస్టు 2026న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాన్ని ప్రారంభించేందుకు పర్యటిస్తున్నారు, ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు భోగాపురం కి తరలించవలసి ఉన్నందున 01 ఆగస్టు 2026న ప్రజల కార్యక్రమంలో వేదికకు రవాణా చేసేందుకు జిల్లాలు వివిధ ప్రభుత్వం మరియు ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు మరియు ఇంజనీరింగ్ కళాశాల నుంచి బస్సులను సమీకరించాలని నిర్ణయించడం జరిగింది. అందుకు అనుగుణంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో అన్ని విద్యాసంస్థలు అనుగుణంగా పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాల & ఇంజనీరింగ్ కళాశాలలో 31 జులై 2026 మరియు 01 ఆగస్టు 2026 ఈ రెండు రోజులు సెలవు ప్రకటిస్తూ జిల్లా మరియు జిల్లా మెజిస్ట్రేట్ వారి నోటీస్ ఆర్డర్ జారీ చేయడం జరిగింది.
జిల్లాలోని విద్యాసంస్థలకు 31.07.2026 మరియు 01.08.2026 తేదీలలో సెలవుల ప్రకటన – జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ జారీ చేయబడిన ఉత్తర్వులు.. జిల్లాలో అన్ని విద్యాసంస్థలకు తమకు బస్సులను అందించే సహకరించాలని జిల్లా కలెక్టర్ స్పష్టంగా సర్కులర్ జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు & రాష్ట్రంలో మంత్రులు, ఎంపీలు ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.


