TS 10వ తరగతి ఫలితాలు విడుదల | Telangana 10th class results 2025 Date 2025
Telangana 10th Result 2025 Out:
ఫ్రెండ్స్.. తెలంగాణ లో 5.05 లక్షల మంది విద్యార్థులు పరీక్ష కేంద్రాల్లో హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో Telangana 10th Result Date అధికారకంగా విడుదల చేయడం జరిగింది. తెలంగాణ పదవ తరగతి జవాబు పత్రాలు 26 నుంచి 10th జవాబు పత్రాల వాల్యూయేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఏప్రిల్ చివరి వారంలో లేదా మే మొదటి వారంలో ఫలితాలను వెల్లడి అధికారికంగా తెలియజేయడం జరిగింది.

తెలంగాణలో ఈ నెల 21 నుంచి ప్రారంభమైన 10వ తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం మార్చి 26 నుంచి ఆరంభం కానుంది. పరీక్షలు ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయి, కానీ భాషా పరీక్షలు ముగిసిన వెంటనే మూల్యాంకనం ప్రారంభించనున్నారు. ఈ ప్రక్రియను రాష్ట్ర వ్యాప్తంగా 19 కేంద్రాల్లో నిర్వహించనున్నారు, ఇందులో హైదరాబాద్‌లో రెండు కేంద్రాలు ఉంటాయి, మిగిలినవి వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేస్తారు.
మొత్తం 5.05 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు.

మూల్యాంకనం మార్చి 26 నుంచి ఏప్రిల్ 13 వరకు పూర్తి చేయాలని అధికారులు ప్రణాళిక వేస్తున్నారు. ఒకవేళ ఈ తేదీ వరకు పూర్తి కాకపోతే, మరో రెండు లేదా మూడు రోజుల్లో ముగించి, ఏప్రిల్ చివరి వారంలో లేదా మే మొదటి వారంలో ఫలితాలను విడుదల చేయాలని పాఠశాల విద్యా శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.