తెలంగాణ లో కొత్త పెన్షన్లపై బిగ్ అప్డేట్.. మీ పేరు ఉందా చెక్ చేసుకోండి.. వచ్చే నెల 15 నుంచి కొత్త పెన్షన్లు.. వీరికి మాత్రమే | TS Aasara Pension 2026
Telangana Aasara Pension 2026 Latest News: తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ లపై బిగ్ అప్డేట్ చెప్పింది.. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి కొత్త పెన్షన్లు ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖరరస్తు చేస్తుంది. ఆగస్టు 15వ తేదీన కొత్త పెన్షన్లు విడుదల చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. కొత్తగా 2.5 లక్షల మందికి పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో మొదటి దశలో ఒంటరి మహిళలు, వితంతు పెన్షన్ ఇవ్వాలని తెలుస్తుంది. ఈ 15 ఆగష్టు 2026 కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు హైదరాబాదులో ప్రారంభించినట్లు తెలుస్తుంది.

తెలంగాణలో ఒంటరి మహిళలు, వితంతువులు అర్హత కలిగిన వృద్ధులకు కొత్త పెన్షన్ అందించేందుకు ఆగస్టు 15న నిర్ణయించుకున్నారు. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన మహిళా అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. అలాగే ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు ఎవరైనా మరణించి ఉన్నట్లయితే వాళ్ల పేరులోనూ వెంటనే జాబితా నుంచి తొలగించాలని మంత్రిగారు ఆదేశాలు జారీ చేశారు. అలాగే లబ్ధిదారుల ధ్రువీకరణ కోసం లైవ్ అథ్లెటికేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆగస్టు 15వ తేదీ నుంచి అర్హత కలిగిన ఖాతాలలో పెన్షన్ నగదు జమ కానున్నది.
దీంతో ఎన్నో నెలలుగా కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నా వేలాది మందికి ఒంటరి మహిళలకు, ఇతర అర్హతల కలిగిన వ్యక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో వృద్ధాప్య పెన్షన్ కోసం కనీసం 57 సంవత్సరాల వయసు పైబడి ఉండాలి. వితంతువు అయితే భర్త మరణం పత్రం తప్పనిసరిగా ఉండాలి. ఒంటరి మహిళకు 18 ఏళ్ల నుండి కుటుంబం నుంచి ఎలాంటి ఆధారం లేని వారై ఉండాలి. అంగవైకల్యం కలిగిన వారు 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న ప్రభుత్వ వైద్య అధికారి నుంచి సర్టిఫికెట్ కలిగి ఉండాలి. దరఖాస్తు కోసం అర్హులైన వారు ముఖ్యమైన పత్రాలు సమర్పించుకోవాల్సి ఉంటుంది అందులో ముఖ్యంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, నివాస ధ్రువీకరణ పత్రం, బ్యాంక్ పాస్ బుక్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ నెంబరు & ఆదాయ ధ్రువీకరణ పత్రం వికలాంగులు అయితే వికలాంగుల సర్టిఫికెట్ వితంతువు అయితే డెత్ సర్టిఫికెట్ సమర్పించుకోవలసి ఉంటుంది. గ్రామ పంచాయతీ, ప్రజా పాలన సేవా కేంద్రం, MPDO, మున్సిపల్ కార్యాలయంvనుంచి ఫారమ్ సేకరణ చేయూత పెన్షన్ కోసం ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం అధికార వెబ్సైట్ నీ https://www.cheyutha.telangana.gov.in/ సంప్రదించండి.


