విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్.. ఇస్రోలో క్లర్క్ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం | ISRO UDC Notification 2026
ISRO Assistant, JPA, Clerk & Stenographer Recruitment 2026 Apply Online : కొత్తగా ఇస్రోలో క్లర్క్, అసిస్టెంట్, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ & స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు 27-07-2026 (ఉదయం 10.00 గంటల నుండి) 16-08-2026 (రాత్రి 11.55 గంటల వరకు) ISRO వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది.

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ [ISRO], ఇస్రోలో క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది. 242 పోస్టులకు ఇస్రో ఫుల్ నోటీస్ జారీ చేసింది. ఇందులో అసిస్టెంట్, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్ & స్టెనోగ్రాఫర్ పోస్టులకు జులై 27 నుంచి ఆగస్టు 16 వరకు https://www.isro.gov.in/ ఆన్లైన్ లో అప్లె చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో తెలుగు రాష్ట్రాలలో శ్రీహరికోట (AP) లో 49 పోస్టులు & HYDలో 15 పోస్టులు ఖాళీలున్నాయి. ఈ ఉద్యోగులకు 60% మార్కులతో ఏదైనా డిగ్రీ, కంప్యూటర్ నైపుణ్యం/స్టెనోటైపిస్ట్, 28 ఏళ్ల లోపు ఉన్న వారు అర్హులు. పే లెవల్ 4: రూ.₹25,500/- to ₹81,100/- మధ్యలో నెల జీతం ఇస్తారు. ఫీజు ₹100/- to ₹500. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఇస్రో కేంద్రాలు/యూనిట్ల వివరాల కోసం, దయచేసి http://www.isro.gov.in/isro centres.html ను సందర్శించండి.
పోస్టు పేరు: అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ & స్టెనోగ్రాఫర్.
మొత్తం ఖాళీలు: 242
విద్య అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం ప్రకటించిన ప్రకారం, కనీసం 60% మార్కులతో లేదా 10-పాయింట్ల స్కేలుపై 6.32 CGPAతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. విశ్వవిద్యాలయం నిర్దేశించిన కోర్సు వ్యవధిలోగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. దాంతోపాటు కంప్యూటర్ నైపుణ్యం కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
వయోపరిమితి: 16.08.2026 నాటికి 28 సంవత్సరాలు (పోస్టులు రిజర్వ్ చేయబడిన చోట, ఓబీసీ అభ్యర్థులకు 31 సంవత్సరాలు మరియు ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 33 సంవత్సరాలు). భారత ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, ప్రస్తుతం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ సైనికులు; దివ్యాంగులు, ప్రతిభావంతులైన క్రీడాకారులు; వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలు మరియు న్యాయపరంగా భర్తల నుండి విడిపోయి, పునర్వివాహం చేసుకోని మహిళలు వయో సడలింపునకు అర్హులు.
•దరఖాస్తు రుసుము: అన్ని పోస్టులకు ₹100/- (వంద రూపాయలు మాత్రమే) దరఖాస్తు రుసుము ఉంటుంది. అయితే, ప్రారంభంలో అభ్యర్థులందరూ ప్రతి దరఖాస్తుకు ప్రాసెసింగ్ ఫీజుగా ఏకరీతిగా 500/- (ఐదు వందల రూపాయలు మాత్రమే) చెల్లించాలి.
•నెల జీతం : పే లెవల్ 4: రూ.₹25,500/- to ₹81,100/-
•అప్లికేషన్ : ఆన్లైన్ https://www.isro.gov.in/ ద్వారా.
•అప్లికేషన్ ప్రారంభం: 27 జులై 26.
•లాస్ట్ డేట్ : 16 ఆగష్టు 26.
•సెలెక్షన్ ప్రాసెస్: ఈ ఉద్యోగులకు రాత పరీక్ష ద్వారా సెలక్షన్ ఉంటుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు 27-07-2026 (ఉదయం 10.00 గంటల నుండి) 16-08-2026 (రాత్రి 11.55 గంటల వరకు) ISRO వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. దరఖాస్తులు ఆన్లైన్లో మాత్రమే స్వీకరించబడతాయి.

🛑Notification Pdf Click Here
🛑 Official Website Click Here
🛑Online Apply Link Click Here

