Breaking News దీపం-2 పథకం ఇలా చేస్తేనే 2వ సిలిండర్ పంపిణీ | Free 2nd Gas Cylinder Update For Ap All Schemes Details In Telugu Telugu Jobs Point
Andhra Pradesh Free Gas Cylinder Scheme Update : ఉచితంగా గ్యాస్ సిలిండర్ పొందాలని అభ్యర్థులకు శుభవార్త.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీ ప్రకారం, రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డు ఉన్న మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించే “దీపం-2” పథకాన్ని ప్రవేశపెట్టింది. 2024 అక్టోబర్ 29న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీపావళి పండుగ సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద ప్రతి నాలుగు నెలలకు ఒకటి చొప్పున ఏటా మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందజేస్తారు.

ఉచిత సిలిండర్ సంవత్సరంలో ఎప్పుడు ఎప్పుడు ఇస్తారంటే.. 2025 మార్చి 31: మొదటి ఉచిత గ్యాస్ సిలిండర్ పొందేందుకు చివరి తేదీ. 2025 ఏప్రిల్ – జులై: రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ పొందే సమయం. 2025 ఆగస్ట్ – నవంబర్: మూడో ఉచిత గ్యాస్ సిలిండర్ పొందే సమయం.
ఉచిత గ్యాస్ సిలిండర్ పొందే విధానం
• మొదటగా గ్యాస్ బుక్ చేసుకోవాలి – లబ్ధిదారులు తమ గ్యాస్ కనెక్షన్ ద్వారా ముందుగా సిలిండర్ బుక్ చేయాలి.
• మొదట డబ్బులు చెల్లించాలి – గ్యాస్ సిలిండర్ అందుకున్న తర్వాత, కొన్నిరోజులలో బ్యాంక్ ఖాతాలో రాయితీగా డబ్బులు జమ అవుతాయి.
• ఈకేవైసీ తప్పనిసరి – ఉచిత సిలిండర్ పొందేందుకు ఈకేవైసీ (eKYC) పూర్తిగా చేయాలి.
🔥రైల్వే లో 9900 అసిస్టెంట్ లోకో పైలట్ Govt జాబ్స్ | Railway RRB ALP Notification 2025
ఈకేవైసీ లేకపోతే వచ్చే సమస్యలు ఈకేవైసీ పూర్తిగా చేయకపోతే రాయితీ డబ్బులు అకౌంట్‌లో జమ కావు. ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్‌తో లింక్ చేయకపోతే సమస్యలు ఎదురవుతాయి. ఒకే రేషన్ కార్డు పై రెండు గ్యాస్ కనెక్షన్లు ఉంటే ఉచిత సిలిండర్ పొందలేరు. అధిక విద్యుత్తు వినియోగం ఉన్నవారు కూడా రాయితీ పొందలేకపోవచ్చు.

ఉచిత గ్యాస్ పొందడంలో సమస్యలు ఉంటే ఏమి చేయాలి? 1967 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. స్థానిక పౌర సరఫరాల కార్యాలయం లేదా తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించాలి. గ్యాస్ ఏజెన్సీ ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు.
ఉచిత గ్యాస్ సిలిండర్ పొందేందుకు మార్చి 31 చివరి తేదీ. లబ్ధిదారులు వెంటనే ఈకేవైసీ పూర్తి చేసుకొని, గ్యాస్ బుకింగ్ చేసుకోవాలి. ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అవసరమైన అన్ని పత్రాలను సమర్పించుకోవడం చాలా ముఖ్యం.
🔥Anganwadi Helper Jobs : అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం