Anganwadi Jobs : 14,236 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు
Anganwadi Jobs : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.3,04,965 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ లో ఖాళీగా ఉన్న 14,236 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఉద్యోగాలకు కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో రాత పరీక్ష లేకుండా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేస్తే సొంత జిల్లాలో ఉద్యోగం వస్తుంది.
ఈ పోస్టుల భర్తీ ద్వారా అంగన్వాడీ సేవలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 57,946 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి, 30,228 కొత్త పోస్టులను మంజూరు చేసినట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.
🛑AP Constable Jobs : త్వరలో 10,762 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు నిరంతర కృషి చేస్తోంది. వరుసగా నోటిఫికేషన్లు జారీ చేసి, ఉద్యోగాలను భర్తీ చేయడం ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగ రేటును 22.9 శాతం నుంచి 18.1 శాతానికి తగ్గించిందని మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈ చర్యలు రాష్ట్ర యువతకు ఉద్యోగ అవకాశాలు అందించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.
ఈ బడ్జెట్‌లో, రాజీవ్ యువ వికాసం పథకానికి రూ.6,000 కోట్లు కేటాయించారు. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం ద్వారా ఐదు లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
రాష్ట్రంలోని యువతకు మెరుగైన టెక్నికల్ విద్య అందించేందుకు ప్రభుత్వం ముచ్చర్లలో యంగ్ ఇండియా టెక్నికల్ యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అదేవిధంగా, 200 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేక టెక్ హబ్‌ను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
🛑 కేవలం పదో తరగతి అర్హతతో రాత పరీక్షలు లేకుండా ఉద్యోగం

త్వరలోనే వివిధ నోటిఫికేషన్ల ద్వారా 57,946 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టనున్నట్లు మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ చర్యల ద్వారా, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తగ్గించడంలో ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. త్వరలో ఈ 14,236 అంగన్వాడీ పోస్టులను భర్తీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలియజేస్తున్నారు.
🔥Ragi Idli Recipe : ఉదయాన్నే 10ని||ల్లో చేసుకొనే దూదిలాంటి మెత్తటి రాగి ఇడ్లీలు