AP Constable Jobs : త్వరలో 10,762 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ
Andhra Pradesh police constable notification 2025 : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 6,100 కానిస్టేబుల్ ఉద్యోగ భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా శారీరక సామర్థ్య పరీక్షలు (PET) మరియు శారీరక కొలతల పరీక్షలు (PMT) జరగడం జరిగింది. ఈ పరీక్షలకు 69,000 మంది అభ్యర్థులు హాజరుకాగా, 39,000 మంది అర్హత సాధించారు. తరువాత దశలో తుది రాత పరీక్షలు మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్ తొలి వారంలో ఉన్నట్లుగా అధికారికంగా తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10,762 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని హోం మంత్రి వంగలపూడి అనిత అసెంబ్లీలో వెల్లడించారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని, అనుమతి లభించగానే ఉద్యోగ నియమకాలు చేస్తామని తెలియజేశారు. కావున కానిస్టేబుల్ ఉద్యోగాల్లో భర్తీ కావాలనుకున్న అభ్యర్థులు ఇప్పుడు నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఎవరైతే రాత పరీక్ష కోసం మంచిగా ప్రిపేర్ అవుతారు వాళ్లకు మాత్రమే ఉద్యోగం వస్తుంది.