No Fee, No Exam : 10th అర్హతతో భారీగా ఆఫీస్ సబార్డినేట్ & డేటా ఎంట్రీ ఆపరేటర్ నోటిఫికేషన్ విడుదల
AP Polavaram Irrigation Project Jobs Recruitment 2025 latest office subordinate data entry operator job notification Apply Now : ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఫీజు లేకుండా 10th అర్హతతో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల. ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ మరియు ఎక్స్ అఫీసియో జాయింట్ కలెక్టర్, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్, రాజమహేంద్రవరం వారు 18 మార్చి 2025న నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని ఆర్ & ఆర్ కార్యాలయాలు రంపచోడవరం, ఎటపాక, చింతూరు ప్రాంతాలలో 24 జూలై 2026 వరకు పనిచేయడానికి అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥APPSC Jobs : అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులకు పరీక్షల హాల్ టికెట్లు విడుదల

మొత్తం 6 ఔట్‌సోర్సింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి:
• సీనియర్ అసిస్టెంట్ – 1 పోస్టు
• వర్క్ ఇన్‌స్పెక్టర్ – 2 పోస్టులు
• డేటా ఎంట్రీ ఆపరేటర్ – 2 పోస్టులు
• ఆఫీస్ సబార్డినేట్ – 1 పోస్టు తదితర ఉద్యోగాలు ఉన్నాయి.
🔥AP Jobs : మెడికల్ కాలేజీల్లో 1,183 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీ
విద్యార్హతలు:
• సీనియర్ అసిస్టెంట్: ఏదైనా డిగ్రీ.
• వర్క్ ఇన్‌స్పెక్టర్: డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్ లేదా బి.టెక్ ఇన్ సివిల్ ఇంజినీరింగ్.
• డేటా ఎంట్రీ ఆపరేటర్: బి.సి.ఏ, ఎం.సి.ఏ, బి.టెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ లేదా కంప్యూటర్స్‌లో ఏదైనా డిగ్రీ.
• ఆఫీస్ సబార్డినేట్: 10వ తరగతి లేదా దానికి సమానమైన విద్యార్హత.
వయస్సు పరిమితి: 18 నుండి 42 సంవత్సరాల మధ్య (18 సెప్టెంబర్ 2024 నాటికి).
🔥Ragi Idli Recipe : ఉదయాన్నే 10ని||ల్లో చేసుకొనే దూదిలాంటి మెత్తటి రాగి ఇడ్లీల
ఎంపిక విధానం:
• సీనియర్ అసిస్టెంట్, వర్క్ ఇన్‌స్పెక్టర్, డేటా ఎంట్రీ ఆపరేటర్: వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ఉంటుంది
• ఆఫీస్ సబార్డినేట్: విద్యార్హతలో మెరిట్ మరియు పని అనుభవం ఆధారంగా.
దరఖాస్తు విధానం:
అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను సంబంధిత ధృవపత్రాలతో (గెజిటెడ్ అధికారి ద్వారా అటెస్టెడ్ చేయబడిన విద్యార్హత సర్టిఫికేట్లు, స్టడీ సర్టిఫికేట్లు, కుల ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో) జతచేసి, 7 ఏప్రిల్ 2025 సాయంత్రం 5 గంటలలోపు ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్, సి.ఆర్.పి. గెస్ట్ హౌస్, ధవళేశ్వరం గ్రామం, రాజమహేంద్రవరం రూరల్ కు నేరుగా అందజేయాలి.
ఎంపిక కాబడిన అభ్యర్థులు ఆర్ & ఆర్ కార్యాలయము, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్, రంపచోడవరం, చింతూరు మరియు ఎటపాక యూనిట్స్, అల్లూరి సీతారామరాజు జిల్లా నందు పనిచేయవలసి ఉంటుంది.

🛑Notification Pdf Click Here
🔥Jio, Airtel, BSNL, VI SIM మొబైల్ రీఛార్జ్ చేయకుండా ఎన్ని రోజుల్లో యాక్టివ్ లో ఉంటుంది మీకు తెలుసా