AP 10th Class Results 2026 Release Date | రేపే పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
AP 10th Class Results 2026 Release Date Latest News : ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి ఫలితాలు కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు మరియు విద్యార్థి తల్లిదండ్రులకు శుభవార్త.. ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలు 30 ఏప్రిల్ 2026న రేపు గురువారం విడుదల చేయనన్నారు. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు రేపు ఎక్స్ వేదికగా పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నారు. పదో తరగతి ఫలితాలకు సంబంధించి ప్రెస్ నోట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్ష విభాగం ఇప్పటికే పూర్తి చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఈ సంవత్సరం 6.30 లక్షల మంది పరీక్ష రాశారు. పదో తరగతి ఫలితాలు https://bse.ap.gov.in/ వెబ్సైట్ ద్వారా లేదా మనమిత్ర వాట్సాప్ 9552300009 ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు.

విద్యార్థులు తమ ఫలితాలను ఈ క్రింది వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు
1. విద్యార్థులు https://bse.ap.gov.in/ వెబ్సైట్ ను ఓపెన్ చేయండి.
2. హోంపేజ్ లో SSC Public Examinations 2026 Results వెబ్సైట్ ఓపెన్ చేయండి.
3. విద్యార్థులు రోల్ నెంబరు & DOB ఎంటర్ చేసి రిజల్ట్స్ ను ఒక క్లిక్ లో తెలుసుకోవచ్చు.
విద్యార్థులు తమ ఫలితాలను ఈ క్రింది వాట్సాప్ గవర్నెన్స్ (ManaMitra)లో చూసుకోవచ్చు
1. అభ్యర్థులు 9552300009 నంబర్కు వాట్సాప్ కు Hi అన్ని మెసేజ్ పంపించి పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్రింది విధంగా వెళ్లాలి:
2. విద్యా సేవలు → పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను → SSC హాల్ టికెట్ నంబర్ గెట్ రిజల్ట్స్ పైన క్లిక్ చేస్తే వెంటనే PDF రూపంలో పదో తరగతి ఫలితాలు వాట్సాప్ లో పొందవచ్చు.


