RBI Jobs : ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులలో ఆఫీసర్ గ్రేడ్ బి నోటిఫికేషన్ వచ్చేసింది | RBI Officers in Grade ‘B’Jobs Notification 2026 Salary, eligibility, apply links
Reserve Bank of India Job Recruitment 2026 Latest RBI Officers in Grade ‘B’ Notification 2026 Apply Now : నిరుద్యోగులకు భారీ నోటిఫికేషన్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)లో గ్రేడ్ ‘బి’ (డైరెక్ట్ రిక్రూట్-డిఆర్) (ప్రొబేషన్‌పై-ఓపి) (జనరల్/డిఇపిఆర్/డిఎస్ఐఎం) కేడర్‌లలోని ఆఫీసర్ల 60 పోస్టుల భర్తీ నోటిఫికేషన్ వచ్చేసింది. ఇతర వివరాల కోసం, దయచేసి ఏప్రిల్ 29, 2026 (తాత్కాలికంగా) తేదీన బ్యాంక్ వెబ్‌సైట్ (www.rbi.org.in)లో ఆన్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)లో ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ ‘B’ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రేడ్ ‘బి’ (డైరెక్ట్ రిక్రూట్-డిఆర్) (ప్రొబేషన్‌పై-ఓపి) (జనరల్/డిఇపిఆర్/డిఎస్ఐఎం) 60 పోస్టులను భర్తీ చేయనుంది. ఆన్‌లైన్ / రాత పరీక్షలు మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. Any డిగ్రీ పాసై, 21-30ఏళ్ల వయసున్నవారు అర్హులు. ఏప్రిల్ 29 నుండి మే 20, 2026 వరకు (సాయంత్రం 06:00 గంటల వరకు) లోపు అభ్యర్థులు పైన పేర్కొన్న పోస్టులకు బ్యాంక్ వెబ్‌సైట్ (www.rbi.org.in) ద్వారా ఆన్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.

•కనీస అర్హత :
•ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ ‘B’ (DR)- జనరల్ : ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్/సమానమైన సాంకేతిక లేదా వృత్తిపరమైన అర్హతలో అన్ని సెమిస్టర్‌లు / సంవత్సరాల మొత్తం మీద కనీసం 60% మార్కులు (SC/ST/PwBD అభ్యర్థులకు 50%) లేదా ఏదైనా విభాగంలో పోస్ట్-గ్రాడ్యుయేషన్/సమానమైన సాంకేతిక లేదా వృత్తిపరమైన అర్హతలో కనీసం 55% మార్కులు (SC/ST/PwBD అభ్యర్థులకు పాస్ మార్కులు).
•ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ ‘B’ (DR)- డిపార్ట్మెంట్ అఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్ (DEPR): ఎకనామిక్స్‌లో ఎంఏ/ ఎంఎస్సీ లేదా క్వాంటిటేటివ్ ఎకనామిక్స్, మ్యాథమెటికల్ ఎకనామిక్స్, అప్లైడ్ ఎకనామిక్స్, ఎకనోమెట్రిక్స్, ఫైనాన్షియల్ ఎకనామిక్స్, బిజినెస్ ఎకనామిక్స్, అగ్రికల్చరల్ ఎకనామిక్స్, ఇండస్ట్రియల్ ఎకనామిక్స్, డెవలప్‌మెంట్ ఎకనామిక్స్ మరియు ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ వంటి కోర్సులలో ఎంఏ/ ఎంఎస్సీ (ఇక్కడ “ఎకనామిక్స్” పాఠ్యప్రణాళిక/ సిలబస్‌లో ప్రధాన భాగంగా ఉంటుంది).
•ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ ‘B’ (DR)- డిపార్ట్మెంట్ of స్టాటిష్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మానేజ్మెంట్ (DSIM): అన్ని సెమిస్టర్‌లు/సంవత్సరాలలో కలిపి కనీసం 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా ప్రభుత్వం/యూజీసీ/ఏఐసీటీఈ ఆమోదించిన/గుర్తింపు పొందిన భారతీయ/విదేశీ విశ్వవిద్యాలయం/సంస్థ నుండి గణాంకాలు/గణితం/గణిత గణాంకాలు/అనువర్తిత గణాంకాలు/పరిమాణాత్మక అర్థశాస్త్రం/ఎకనోమెట్రిక్స్/ఇన్ఫర్మేటిక్స్ లేదా ఈ రంగాలకు సంబంధించిన ఇతర శాఖలలో సమానమైన గ్రేడ్/సీజీపీఏ. మరిన్ని వివరాలను నోటిఫికేషన్ లో చూడండి.
•మొత్తం పోస్టులు ::
•ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ ‘B’ (DR)- జనరల్, ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ ‘B’ (DR)- డిపార్ట్మెంట్ అఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్ (DEPR) & ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ ‘B’ (DR)- డిపార్ట్మెంట్ అఫ్ స్టాటిష్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మానేజ్మెంట్ (DSIM) మొత్తం 60 పోస్టులు ఉన్నాయి.
•వయస్సు :
•20 మే 2026 నాటికి నాటికి 21 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి మరియు 30 సంవత్సరాల వయస్సు మించకూడదు.
•నెల జీతం : ఉద్యోగానికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్ బేసిక్ పే 35,150/- ఉంటుంది.
•అప్లికేషన్ ఫీజులు :: ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ విద్యార్థులకు ₹100/-+ 18%GST & జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ₹850/- + 18% GST అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
•ఎంపిక ప్రక్రియ :: పైన పేర్కొన్న పోస్టులకు ఎంపిక ప్రక్రియ మొదటి మరియు రెండవ దశలలో ఆన్‌లైన్ / రాత పరీక్షలు మరియు ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది.
•ఎలా దరఖాస్తు చేయాలి : అభ్యర్థులు బ్యాంకు వెబ్‌సైట్ www.rbi.org.in ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సమర్పించడానికి వేరే విధానం అందుబాటులో లేదు. “ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం”ను పూరించడానికి సంక్షిప్త సూచనలు అనుబంధం-1లో ఇవ్వబడ్డాయి.
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆన్లైన్ దరఖాస్తు సమర్పణకు ప్రారంభం తేదీ : ఏప్రిల్ 29, 2026
•ఆన్లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ మరియు సమయం :: మే 20, 2026 వరకు (సాయంత్రం 06:00 గంటల వరకు)

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here

