AP NTR Pension : ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈనెల 30నే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ..
AP NTR Bharosa Pension August month distribution a Day early : ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ రెండు రోజులు ముందే పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీకి 514.42 కోట్ల రూపాయలు ముందుగా విడుదల చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ తీసుకునే అభ్యర్థులందరికీ అలర్ట్.. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ఆగస్టు 01 తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు. ప్రధానమంత్రి పర్యటన కారణంగా జూలై 30వ తేదీన పెన్షన్లు పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరు జిల్లాలలో ఆదేశాలు జారీ చేశారు. పింఛన్ల పంపిణీకి శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం మన్యం ఈ జిల్లాలలో జూలై 30వ తేదీన పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. కావున ప్రజలందరూ తమ పెన్షన్లు జూలై 30వ తేదీ తేదీ పొందే అవకాశం ఉంది. పింఛన్ల కోసం 29 జులై 2026 నా స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది నగదు విత్డ్రా చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చారు. పై చెప్పిన ఆరు జిల్లాలలో పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.514.42 కోట్ల రూపాయలను విడుదల చేసింది.
ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను ఈనెల 30న పంపిణీ చేస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు తెలిపారు. అన్ని జిల్లాలలో 11.98 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు.


