No Fee.. No Exam | 12th అర్హతతో హైదరాబాదులో అంగన్వాడిలో టీచర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Telangana Hyderabad district Anganwadi Teacher Notification 2026
Telangana Hyderabad district Anganwadi Teacher vacancy : హైదరాబాదు జిల్లాలోని మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ పరిధిలో గల (5) ఐ.సి.డి.యస్ Project పరిధిలో 181 ఖాళీగా ఉన్న మెయిన్ అంగన్ వాడి టీచర్లు పోస్టులు భర్తీ చేయడానికి అర్హులైన మహిళా అభ్యర్థినుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు కోరనైనది. దరఖాస్తు ప్రారంభ తేదీ: 29.07.2026, ఉదయం 10.30 AM నుండి దరఖాస్తు ముగింపు తేదీ: 22.08.2026 సాయంత్రం 5.00 PM వరకు. ఖాళీలు, విద్యార్హత, వయస్సు, స్థానికత, రిజర్వేషన్‌కు సంబంధించిన మరియు ఇతర సంబంధిత పూర్తి వివరములు http://wdcw.tg.nic.in వెబ్సైట్ నందు పొందగలరు.

అభ్యర్థినిలు దరఖాస్తు చేసుకోవడానికి ఉండవలసిన అర్హతలు సదరు అభ్యర్థినిలు తప్పనిసరిగా ఇంటర్మీడియట్/ క్లాస్ 12 ఉత్తీర్ణులై ఉండవలయును. 01/07/2026 నాటికి వయస్సు, 18 సంవత్సరములు నుండి 35 సంవత్సరములలోపు ఉండాలి. సదరు అభ్యర్థినిలు తప్పనిసరిగా స్థానికంగా సంబంధిత వార్డు వాస్తవ్యులై ఉండవలయును మరియు సంబంధిత తహసిల్దార్ గారిచే ధృవీకరించిన నివాస ధృవీకరణ పత్రము తప్పనిసరిగా జతచేయవలయును. ఈ నోటిఫికేషన్ జారీ చేసిన తేది నుండి ఒక సంవత్సరములోపు తీసుకున్న నివాస ధృవీకరణ పత్రములను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. పోస్టు వారీగా నిర్దేశించిన రోస్టర్ పాయింట్ (కులం/వర్గం)కు సంబంధించిన అభ్యర్థినులు మాత్రమే అర్హులు. ఒక వేళ అభ్యర్థిని పేరులో ఏమైనా మార్పు ఉన్నట్లయితే అది గజెట్లో గాని కోర్టు ఉత్తర్వులు గాని ఉంటేనే ఆ అభ్యర్ధిని పేరును పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థినులకు సూచనలు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థినులు వారు దరఖాస్తు చేసుకున్న అంగన్ వాడి కేంద్రము యొక్క సంబంధిత ఐ.సి.డి.యస్ Project కార్యాలయములో తేదీ 23.08.2026, ఉదయం 10.30 AM నుండి తేదీ: 01.09.2026 సాయంత్రం 5.00 PM వరకు తమ ఒరిజినల్ ధృవీకరణ పత్రములను (Certificates/ Documents) పరిశీలనకు సమర్పించవలెను (Certificate verification) మరియు దరఖాస్తుతో పాటు దరఖాస్తులో పేర్కొన్న అర్హతలకు సంబంధించిన Certificate Xerox copyలను (2 sets)ను జతపరచి ఐ.సి.డి.ఎస్ కార్యాలయంలో ఇవ్వవలెను.
ఆన్లైన్లో అప్లైచేయకుండా మాన్యువల్ గా ఇచ్చిన దరఖాస్తులు పరిగణనలోకి తీసుకోబడవు. ఈ నోటిఫికేషన్ పూర్తిగా రెద్దు పరచటానికి గానీ, మార్పులు చేయడానికిగానీ జిల్లా కలెక్టర్ గారికి పూర్తి అధికారం కలదు.
•దరఖాస్తు ప్రారంభం తేదీ : 29/07/2026
•దరఖాస్తు చివరి తేది: 22/08/2026 సాయంత్రము 5.00 గంటల వరకు
వెబ్ సైట్: https://mis.tgwdcw.in/

🛑Notification Pdf Click Here
🛑Vacancy Details Click Here
🛑Apply Online Link Click Here

