తల్లికి వందనం డబ్బులు పడలేదా? ఇలా చేయండి | AP Thalliki Vandanam Scheme 2026 Amount Not Received

తల్లికి వందనం డబ్బులు పడలేదా? ఇలా చేయండి | AP Thalliki Vandanam Scheme 2026 Amount Not Received

AP Thalliki Vandanam Scheme 2026 Amount Not Received Latest News : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం నిధులు విడుదల చేశారు. మీ ఖాతాలో ఇంకా రూ.13,000 పడలేదా? నో టెన్షన్ ఇలా చేయండి సరిపోతుంది.

ఆంధ్రప్రదేశ్ లో తల్లికి వందనం పథకానికి అర్హత ఉండి పలు కారణాలుగా డబ్బులు రాని వారికి ప్రభుత్వం మరొక ఛాన్స్ ఇస్తుంది. గత సంవత్సరం లబ్దిపొంది తాజా అనర్హులు జాబితాలో చేరడం, ఇతర సమస్యలతో పథకం వర్తించని వారు రేపు నుంచి పది రోజులలో గ్రామ వార్డు సచివాలయాలు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామ వార్డులో వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా గ్రీవెన్స్ మాడ్యూల్ లో రిక్వెస్ట్ పెట్టాలి. విద్యుత్ బిల్లులు సహా ఇతర లోపాలతో లబ్ధి పొందని వారు అప్లై చేసుకోవచ్చు.

తల్లికి వందనం డబ్బులు పడలేదా వెంటనే ఈ రెండు పనులు చేయండి.. ముందుగా మీ బ్యాంకు కి వెళ్లి బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం, NPCI మ్యాపింగ్ యాక్టివ్ లో ఉందో లేదో సరి చేసుకోండి. ఈ రెండు సాంకేతిక లోపాల వల్లనే చాలామందికి నగదు జమ కాకపోవడం జరిగింది. మీకు డబ్బులు రాకపోతే మీ సమీప గ్రామ వార్డు సత్యం లోకి వెళ్లి అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ ని సంప్రదించండి. వారు మీ వివరాలను రీ వెరిఫికేషన్ చేసి, దరఖాస్తును సరిచేసి మళ్లీ పోసిషన్ చేస్తారు. వచ్చే నెల వరకు అభ్యంతరాలు స్వీకరించేందుకు అవకాశం ఉంటుంది. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు మరియు ప్రభుత్వ, పాఠశాలలు & కళాశాలలో చదివే ప్రతి విద్యార్థికి ఈ పథకం వర్తిస్తుంది.

తల్లికి వందనం రూ.13,000 డబ్బులు జమ అయ్యాయో లేదో తెలుసుకోవడానికి LEAP App ఉపయోగపడుతుంది. ముందుగా తల్లిదండ్రులు ప్లే స్టోర్ నుంచి LEAP App  డౌన్లోడ్ చేసుకొని పేరెంట్స్ లాగిన్ ద్వారా మీ వివరాలు నమోదు చేయాలి ఆ తర్వాత తల్లికి వందనం స్టేటస్ ఆప్షన్ పైన ఎంచుకోవాలి అక్కడ మీకు నగదు జమ అయిన వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి ఒకవేళ డబ్బులు రాకపోవడానికి కారణం కూడా అందులో తెలుస్తుంది. లేదా తల్లికి వందనం ఎలిజిబులిటీ స్టేటస్ ఈ వెబ్సైట్ https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout ద్వారా చెక్ చేసుకోండి. కారణం లేకపోతే ఇంకా 23, 24 జులై ఈ రెండు రోజుల్లో కూడా వెయిట్ చేసి ఆ తర్వాత గ్రామ వార్డు సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ ని సంప్రదించండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *