ఏపీ లో గణపతి మండపాల ఏర్పాటుకు ఆన్లైన్ లో అప్లై చేయడమేలా? | AP Ganesh Pandals Online Registration guidelines
AP Ganesh Pandals Online Permission Portalguide : ఆంధ్రప్రదేశ్ లో వినాయక చవితి పండుగ వేళ మీ వీధిలో లేదా సొసైటీలో గణేష్ మండపం ఏర్పాటు చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సంవత్సరం ఆన్లైన్ పోర్టల్ ఏర్పాటు చేసింది.. మీరు పోలీస్ స్టేషన్స్ మరియు మునిసిపల్ ఆఫీసు, విద్యుత్ శాఖలో మరియు ఫైర్ స్టేషన్ వద్ద తిరగడం అవసరం లేదు.. ఆన్లైన్లో ఒక క్లిప్ తో ఇక్కడ పూర్తిగా అప్లై చేసుకోవచ్చు… అదేంటంటే ఇప్పుడు తెలుసుకుందాం..

గణపతి మండపాలు ఏర్పాటు చేసుకునేందుకు ముందుగా https://ganeshutsav.net/ అధికార వెబ్ సైట్ ని ఓపెన్ చేయండి. Single Window System For All Permissions Related To Ganesh Utsavam – 2026 హోం పేజ్ లోనే APPLY HERE పైన క్లిక్ చేయండి. ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఓటి వెరిఫికేషన్ చేయాలి. ముందుగా దరఖాస్తు వివరాలు కచ్చితంగా నమోదు చేయాలి. ముఖ్యంగా మండపం ఏర్పాటు చేసే ప్రదేశం చిరునామా పూర్తి వివరాలతో పేర్కొనాలి. ఆ తర్వాత విగ్రహం ఎత్తు, మండపం ఎత్తు, అడుగులతో తెలియజేయాలి. 5 మంది కమిటీ సభ్యుల పేర్లు మొబైల్ నెంబర్లు ఎంటర్ చేయాలి. నిమజ్జనం ఎప్పుడూ, ఎక్కడ చేస్తున్నామనేది కూడా ఇందులో నిమజ్జనం విధానం గురించి తేదీ సమయంతో పేర్కొనాలి. వివరాలు పూర్తిగా చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే తాలుక పోలీస్ స్టేషన్ కు దరఖాస్తు వెళ్తుంది.
ఆ వివరాలను తమ తాలూకా పోలీస్ స్టేషన్ అధికారులు అప్లికేషన్ చెక్ చేస్తారు. అప్రూవల్ వస్తే క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ను ప్రింట్ అవుట్ తీసి మండపంలో అతికించవలసి ఉంటుంది. టైం ఉంది కాబట్టి తప్పనిసరిగా అప్లై చేసుకోండి. అందులో మీకు వీడియోస్ తో కూడా ఎలా అప్లై చేయాలనేది వెబ్సైట్ ఇవ్వడం జరిగింది.

🛑Single Window System For All Permissions Related To Ganesh Utsavam – 2026 Click Here

