APSRTC దివ్యాంగులకు గుడ్ న్యూస్.. దివ్యాంగ శక్తి పథకం ద్వారా ఉచిత ప్రయాణం | APSRTC Divyanga Shakti scheme
APSRTC Divyanga Shakti free rtc bus travel scheme : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులకు దివ్యాంగ సంక్షేమ పథకం ద్వారా దివ్యాంగ శక్తి పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా 40% కంటే ఎక్కువ వెహికల్ కలిగిన అభ్యర్థులకు ఏపీఎస్సి ఆర్టీసీ ద్వారా పూర్తిగా ఉచిత ప్రయాణం కల్పిస్తుంది..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల కోసం దివ్యాంగ శక్తి పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్, నగర సర్వీస్ తో పాటు అంతర్ జిల్లా బస్సులలో ఈ సదుపాయం వర్తిస్తుంది. ఈరోజు నుంచే అధికారికంగా అమలులో చేయనున్నారు. ఈ పథకం ద్వారా దివ్యాంగ ఉద్యోగానికి, విద్యకు, ఉపాధికి, వైద్యం కోసం ఎటువంటి ఖర్చు లేకుండా ఉచితంగా ప్రయాణించే అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తుంది. ప్రయాణ ఖర్చులు వారికి ఆర్థిక భారం మారకుండా ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంది. ఒంటరిగా ప్రయాణించలేని వారికి తోడు వచ్చిన వారికి 50% రాయితీ లభిస్తుంది.
ఉచిత బస్సు సౌకర్యం పొందాలనుకున్న దివ్యాంగులకు అర్హత చూసుకున్నట్లయితే సదనం ధృవీకరణ పత్రం కనీసం 40% వైకల్యం (Disability) నమోదయి ఉండాలి. వినికిడి లోపం, అంధత్వం, మానసిక వైకల్యం, లోకో మోటార్ వైకల్యం ఉన్న అభ్యర్థులు ఈ పథకానికి అర్హులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసే దివ్యంగా శక్తి స్టార్ బస్ పాస్ ద్వారా యూడీఐడీ కార్డు ఉన్నవారే ఈ బస్సుకి ఉచిత ప్రయాణం. దివ్యాంగ స్టార్ బస్ పాస్ లో క్యూఆర్ కోడ్, ఆర్ఎఫ్ఐడి చీప్ ఉండడంతో కండక్టర్ వద్ద ఉండే టికెట్ యంత్రం ద్వారా స్కాన్ చేసి జీరో పే టిక్కెట్టు జారీ చేయడం జరుగుతుంది. దీనికోసం దరఖాస్తు చేసుకోకుండా అభ్యర్థులు గ్రామ వార్డు సచివాలయం లేదా ఆర్టీసీ బస్టాండ్ డిపో కౌంటర్లు దరఖాస్తు చేసుకోవచ్చు.

దివ్యాంగం స్టార్ బస్ పాస్ కోసం సదనం సర్టిఫికెట్ లేదా యూడీఐడీ కార్డు జిరాక్స్, నివాస ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు & పాస్పోర్ట్ సైజ్ ఫోటో అవసరమాతాయి. అర్హులైన అభ్యర్థులు వెంటనే సమీపంలో ఉన్న ఆర్టీసీ బస్సు డిపో కౌంటర్లు దరఖాస్తు చేసుకోవచ్చు లేదా గ్రామ వార్డు సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు వెంటనే అప్లై చేసుకుని ఈ సదుపాయిని పొందుతారని ఆశిస్తున్నాం.

