తల్లికి వందనం నిధులపై ఏపీ ప్రభుత్వం బిగ్ అప్డేట్.. రూ.13,000/- పొందాలంటే ఇలా చేయండి | Talliki Vandanam Scheme 2026
Talliki Vandanam Scheme 2026 Eligibility Status & Release Date all details in Telugu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం కింద అర్హులైన తల్లుల బ్యాంకు ఖాతాలో 13000 నగదు జమ చేసేందుకు ఏర్పాటు పూర్తయ్యాయి. జూలై 16,17,18 వ తేదీలలో విడుదల వారిగా ఈ నగదు లబ్ధిదారు ఖాతాలో డైరెక్ట్ గా జమ చేయనున్నారు. ఈ నగదు పొందాలంటే ముఖ్యంగా తల్లి ఖాతాలకు ఈ కేవైసీ, ఆధార్ లింక్ మరియు NPCI మ్యాపింగ్ తప్పనిసరిగా అయి ఉండాలి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు శుభవార్త తెలిపారు. తల్లికి వందనం పథకం త్వరలో విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేశారు. ఈనెల 16, 17, 18 తేదీలలో బ్యాంకు ఖాతాలో డైరెక్ట్గా రిలీజ్ చేయనున్నారు, ఆయా తేదీలలోనే మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల మీటింగ్ కూడా జరగనున్నాయి. లబ్ధిదారు అకౌంట్లలో 13000 జమ చేస్తుంది. ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 15,000 అందిస్తుండగా 2,000 నిర్మాణం కోసం ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రభుత్వ ఉద్యోగి, కారు, 300 యూనిట్ల కన్నా ఎక్కువ కరెంటు బిల్లు, 5 ఎకరాల నుంచి పొలం వంటి వారు అనర్హులు. దరఖాస్తులలో పొరపాట్లు ఉన్నట్లయితే గ్రామ వార్డు సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ టు సంప్రదించాలి. అర్హత వివరాలు లోపాలు సవరణకు ఇంకా తొమ్మిది రోజులు గడువు ఉంటుంది.
తల్లికి వందనం అర్హత జాబితా ప్రభుత్వం ఆన్లైన్ లో అందుబాటులో ఉంచింది. లబ్ధిదారులు డైరెక్ట్ గా https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout వెబ్సైట్ లోకి వెళ్లి తమ మొబైల్ ద్వారానే తమ అర్హులలా లేదా చెక్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
1. లబ్ధిదారులు ముందుగా https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout వెబ్ సైట్ ని ఓపెన్ చేయండి.
2. తల్లి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి.
3. స్కీం టైపులో తల్లికి వందనం సెలెక్ట్ చేయండి ఆ తర్వాత ఇయర్ లో 2026-27 సంవత్సరం సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత గెట్ డీటెయిల్స్ పై క్లిక్ చేయండి.
4. తల్లి యొక్క ఆధార్ లింక్ అయిన మొబైల్ కు ఓటిపి వస్తుంది. అ ఓటిపి ఎంటర్ చేసి మీరు ఎలిజిబుల్ అవునా? కాదా? తెలుసుకోవచ్చు.

ముఖ్య గమనిక : లబ్ధిదారులు తప్పనిసరిగా తల్లి ఖాతాకు ఈ కేవైసీ, ఆధార్ లింక్ & NPCI మ్యాపింగ్ తప్పనిసరిగా చేపించాలి. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే గ్రామ వార్డు సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ ను సంప్రదించి, అర్హత వివరాలు లోపాలు ఉన్నట్లయితే సవరించుకోవడానికి ఇంకా తొమ్మిది రోజులు గడువు ఉంది.

