ఏపీ లో మరో పథకం అమలు… నేరుగా ఒక్కొక్కరి అకౌంట్ లో రూ.25000 జమ.. AP Nethanna Bharosa Scheme 2026
AP Nethanna Bharosa Scheme 2026 Latest News : నేరుగా చేనేత కార్మికులకు ‘నేతన్నకు భరోసా’ క్రింద ప్రభుత్వం ఏటా అందజేస్తున్న ₹25,000/- ఆర్థిక సహాయం అందచేయడానికి మంత్రి సవిత గారు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ఒక్కొక్కరి అకౌంట్లో రూ.25 వేల డబ్బులు జమ చేస్తున్నట్లు తెలిపారు. ఆప్కో ద్వారా నేతలకు నాణ్యమైన నూలు సరఫరా చేయడంతో పాటు చేనేతలకు ఉచిత విద్యుత్ అందించే ఎన్నికలు ఇచ్చిన హామీని ఇప్పటికి నిలబెట్టుకున్నారని తెలిపారు. ఈ ఆప్కో బకాయిల్లో ఈ నెల 15న రూ.4కోట్లు, వచ్చే నెల తొలివారంలో రూ.2.5కోట్లు చెల్లిస్తామని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక పథకానికి అమలు చేయడానికి నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో త్వరలోనే నేతన్న భరోసా పథకాన్ని అమలు చేయాలని మంత్రి సవిత గారు తెలిపారు. ఈ పథకానికి సంబంధించి కార్యచరణ ఇప్పటికే పూర్తి చేశారని అర్హులైన వారికి ఈ పథకం కింద ఆర్థికసాయం అందిస్తారని తెలిపారు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో చేనేతల అన్నలకు ఉచిత విద్యుత్ తో పాటు సంవత్సరానికి చేనేత కార్మికులకు 25 వేల చొప్పున అందజేయాలని నిర్ణయించిన సంగతి తెలిసినదే. దీని ద్వారా రాష్ట్రంలో చేనేత కార్మికులకు పెట్టుబడి భారం తగ్గించేలా ఆప్కో ద్వారా నూలు సరఫరా చేసే అవకాశాన్ని పరిశీలిస్తానని తెలిపారు సునీత గారు. నేటి తరానికి అనుగుణంగా రెడిమేంట్ చేనేత వస్త్రాల తయారు చేసేలా నేతనలకు శిక్షణ ఇస్తున్నారన్నారు.

ఆప్కో చేనేత సహకార సంఘాలకు చెల్లించవలసిన బకాయిలు 6.50 కోట్లు త్వరలో చెల్లిస్తామని ప్రకటించారు. అందులో ఈనెల 15న 4 కోట్లు బకాయిలు వచ్చే నెల మొదటి వారంలో మరో 2.5 కోట్లను చెల్లిస్తామని తెలిపారు. అలాగే ఆప్కో తో టిడిపికి అవసరమైన సాలువలు కండువాలు ఇతర వస్త్రాలు కొనుగోలుకు ఆర్డర్లు ఇప్పిస్తామని తెలిపారు. మంగళగిరిలో ఆప్కో గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సునీత గారు వెల్లడించారు.

