AP EAPCET Counselling 2026 Schedule Date : ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్.. షెడ్యూల్ విడుదల
AP EAPCET Counselling 2026 Schedule Date Required Documents : ఆంధ్రప్రదేశ్ లో ఇంజనీరింగ్, ఫార్మసీ & అగ్రికల్చర్ కోర్సుల ప్రవేశాల కోసం వెయిట్ చేస్తున్న విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ ప్రవేశలకు ఈనెల 15 నుంచి కౌన్సిలింగ్ నిర్వహించాలని ఉన్నత విద్య ప్రాథమిక నిర్ణయాలు తీసుకున్నారు. కళాశాల అనుబంధ గుర్తింపులను త్వరలో పూర్తి చేసి కౌన్సిలింగ్ చేపట్టాలని భావిస్తున్నారు. ఉన్నత విద్యా మండలి కౌన్సిలింగ్ తేదీలను ప్రకటించడానికి కసరత్తు పూర్తి చేశారు. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? వెబ్ ఆప్షన్ ఎలా ఎంచుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఆంధ్రప్రదేశ్ లో ఎంసెట్ కౌన్సిలింగ్ పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది. ఇందులో ప్రధానంగా నాలుగు దశలలో ఉంటుంది. ముఖ్యంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు పేమెంటు వెబ్సైట్లో మీ హాల్ టికెట్ నెంబర్ మరియు ర్యాంక్ ఎంటర్ చేసి కౌన్సిలింగ్ చూసి చెల్లించాలి. ఆ తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఇది కూడా పూర్తిగా ఆన్లైన్లోనే ఉంటుంది. ఒకవేళ ఏదైనా డాక్యుమెంట్లో తప్పు ఉన్నట్లయితే హెల్ప్ లైన్ సెంటర్ సంప్రదించవలసి ఉంటుంది. ఆ తర్వాత వెబ్ ఆప్షన్ నమోదు, ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్ మీకు కావాల్సిన కాలేజ్ కోర్స్ లిస్టు ప్రాధాన్యత ముఖ్యంగా ఆన్లైన్లో ఎంచుకోవాలి. ఆ తర్వాత సీటు కేటాయింపు మీ ర్యాంకు మీ రిజిస్ట్రేషన్ పెట్టుకున్న వెబ్ ఆప్షన్ ఆధారంగా కాలేజీ సీటు వస్తుంది. ఆ తర్వాత ఫిజికల్ గా కాలేజీకి వెళ్లేసి రిపోర్ట్ చేయాలి. అప్పుడే మీకు ఎంసెట్ కౌన్సిలింగ్ పూర్తి అవుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రవేశాలకు ఈనెల 15 నుంచి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు జారీ చేశారు. ఇంజనీరింగ్ కళాశాలకు కనీసం ఫీజు 40 వేల నుంచి 47 వేల వరకు పెంచింది. రాష్ట్రంలో ప్రస్తుతం 140 ఇంజినీరింగ్ కళాశాలు కనీస ఫీజు 40,000 ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఫీజుల నియంత్రణ పర్యవేక్షణ కమిటీ కళాశాలల ఆదాయం వేయాలను గమనించి రెండు మూడు నెలలలో కొత్త ఫీజులు ఖరారు చేస్తారు. ఈ ఫీజు 2026 -27 విద్యా సంవత్సరం నుంచి మూడేళ్ల పాటు అమలులో ఉంటుంది.
AP EAPCET Counselling 2026 Schedule released Required Documents : కౌన్సిలింగ్ కి హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, టెన్త్ & 12th ఇంటర్ మార్క్స్ మెమో, 6th to 12th స్టడీ సర్టిఫికెట్, కొత్తగా తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల దృవీకరణ పత్రం, EWS సర్టిఫికెట్, TC & ఆధార్ కార్డు తదితర డాక్యుమెంట్ ఉండాలి. మరిన్ని వివరాల కోసం అధికార వెబ్సైట్ ని https://cets.apsche.ap.gov.in/ విజిట్ చేయండి.

🛑Official Website Click Here

