Talliki Vandanam 2026 : తల్లికి వందనం పథకం.. అర్హత ఉందా? లేదా?… ఇలా చెక్ చేసుకోండి

Talliki Vandanam 2026 : తల్లికి వందనం పథకం.. అర్హత ఉందా? లేదా?… ఇలా చెక్ చేసుకోండి

Talliki Vandanam 2026 Eligibility Status Check & Release Date all details in Telugu : ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఈ నెల 16, 17, 18 తేదీలలో తల్లికి వందనం నిధులు విడుదల చేయనున్నది. విద్యార్థులు తల్లుల ఖాతాలలో రూ.13,000/- చొప్పున ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి జమ చేయడం జరుగుతుంది. అయితే ఈ తల్లికి వందనానికి అర్హత ఉందా లేదా అనేది https://bm-sgsw.ap.gov.in/ ఈ లింకు పైన క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. తల్లికి వందనం పథకం డబ్బులు రా అందాలంటే ముఖ్యంగా ఆధార్ కార్డు తో- బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి. అలాగే వెంటనే ఈ కేవైసీ పూర్తి చేయాలి. NPCI మ్యాపింగ్ కూడా చేసి ఉండాలి. అలాలే అలాగే విద్యార్థుల యొక్క అటెండెన్స్ 75% ఉండాలి.

తల్లికి వందనం కోసం ఎదురుచూస్తున్నారా ఈ పనులు చేయకపోతే డబ్బులు రావు.. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం ద్వారా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న ప్రభుత్వం మరియు ప్రైవేటు పాఠశాలు మరియు కళాశాలలో విద్యార్థులకు ప్రతి ఒక్కరికి డైరెక్ట్ గా తల్లుల ఖాతాలో 13,000 జమ కానున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా జూలై 16, 17, 18 తేదీన నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతి పడుతుంది. అయితే తల్లుల బ్యాంకు ఖాతా యాక్టివ్ లో ఉండాలి, ఆధార్ కార్డుతో బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి. ఈ కేవైసీ అయి ఉండాలి. విద్యార్థి మరియు తల్లి యొక్క ఆధార్ కార్డులు ఏదైనా తప్పులు ఉన్నట్లయితే కూడా రాదు కాబట్టి తప్పులను సరి చేసుకోవాలి.

తల్లికి వందనం పథకం మీరు Eligible అవునా? కాదా? ఈ క్రింది విధంగా చెక్ చేసుకోండి..

•ముందుగా అభ్యర్థులు https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout ఈ వెబ్ సైట్ ని ఓపెన్ చేయండి.

•తల్లి యొక్క Aadhaar Number* కాలంలో ఆధార్ కార్డు ఎంటర్ చేయండి, Scheme Type  లో తల్లికి వందనం సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత Select Year లో 2026-27 సెలెక్ట్ చేయండి. గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. మీ ఆధార్ లింకు అయిన మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుంది ఎంటర్ చేయండి.

•కిందికి వెళ్లినట్లయితే పథకం అర్హత కాలిక్యులేటర్ అనే ఆప్షన్ లో ఆదాయపు పన్ను, పొడి భూమి (ఎకరాలు), తడి భూమి (ఎకరాలు), శక్తి (యూనిట్లు), రవాణా, పట్టణ ఆస్తి (చదరపు అడుగులు), ఉద్యోగి వర్గం పై కాలం అన్ని కూడా 7 Satisfied అని వస్తే మీకు తల్లికి వందనం వస్తుంది. మరిన్ని వివరాల కోసం గ్రామ వార్డు సచివాలయంలో వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ను సంప్రదించండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *