CCI Jobs : కాటన్ కార్పొరేషన్ లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | CCI Junior Assistant Notification 2026 Apply Now

CCI Jobs : కాటన్ కార్పొరేషన్ లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | CCI Junior Assistant Notification 2026 Apply Now

The Cotton Corporation of India Ltd. (CCI) Recruitment 2026 Latest CCI Junior Assistant Short Notification 2026 Apply Now : నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్.. ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థుల కోసం.. ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో అసిస్టెంట్ మేనేజర్, మేనేజ్మెంట్ ట్రైనీ & జూనియర్ అసిస్టెంట్ పోస్టుల ఆన్‌లైన్ నియామకం కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ లో 148 ఉద్యోగులు ఉన్నాయి. అప్లై చేసుకుంటే సొంత రాష్ట్రంలో ఉద్యోగం వస్తుంది. అభ్యర్థులు 09.07.2026 తేదీన ఉదయం 10.00 గంటల నుండి 24.07.2026 తేదీన రాత్రి 23.55 గంటల వరకు www.cotcorp.org.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టు వివరాలు- ఖాళీలు

•అసిస్టెంట్ మేనేజర్ (ఆఫీషల్ లాంగ్వేజ్ ) – 01
•అసిస్టెంట్ మేనేజర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) – 01
•మానేజ్మెంట్ ట్రైనీ (మార్కెటింగ్) -08
•మానేజ్మెంట్ ట్రైనీ (అకౌంట్స్) -08 
•జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ -50
•జూనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్)-50
•జూనియర్ అసిస్టెంట్ (జనరల్) -30 మొత్తం కలిపి 148 ఉద్యోగాలు ఉన్నాయి.

•అర్హత: కనీస అర్హతగా Any డిగ్రీ, B. Com, B.Sc. అగ్రికల్చర్, లేదా బి.ఇ./బి.టెక్ లేదా MBA, మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

గరిష్ఠవయోపరిమితి: వయస్సు (18 to 32 సంవత్సరాలు. ఎస్సీ/ఎస్టీలకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీలకు (క్రీమీ లేయర్ మినహా) 3 సంవత్సరాల సడలింపు ఉంటుంది. మరియు బెంచ్‌మార్క్ వైకల్యాలున్న వ్యక్తులకు (PwBDs) 10 సంవత్సరాల (ఎస్సీ/ఎస్టీలకు 15 సంవత్సరాలు మరియు ఓబీసీలకు 13 సంవత్సరాలు) సడలింపు ఉంటుంది, ఇది ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ (నాన్-క్రీమీ లేయర్) వర్గాలకు చెందిన అభ్యర్థులకు వర్తించే సడలింపునకు అదనంగా ఉంటుంది.

•వేతనము : పోస్టును అనుసరించి నెల జీతం అసిస్టెంట్ మేనేజర్ (ఆఫీషల్ లాంగ్వేజ్ ), అసిస్టెంట్ మేనేజర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), మానేజ్మెంట్ ట్రైనీ (మార్కెటింగ్), మానేజ్మెంట్ ట్రైనీ (అకౌంట్స్)రూ. 30,000-1,20,000 (IDA), జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్) & జూనియర్ అసిస్టెంట్ (జనరల్) -30 – రూ.22000-90000 (IDA) మధ్యలో నెల జీతం ఇస్తారు.

•దరఖాస్తు ప్రక్రియ: వెబ్ పోర్టల్ www.cotcorp.org.in/ లో మాత్రమే అందుబాటులో

•దరఖాస్తు ఫీజు: జనరల్/EWS/OBC దరఖాస్తుదారులకు రూ. 1500/- మరియు SC, ST మరియు PwD దరఖాస్తుదారులకు రూ. 500/- (ఐదు వందల రూపాయలు మాత్రమే) అప్లికేషన్ ఫీజు ఉంటుంది.

•ఎంపిక విధానం: ఈ నోటిఫికేషన్ లో రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ & ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.

•దరఖాస్తు విధానం : పైన పేర్కొన్న ప్రమాణాలకు అనుగుణంగా ఆసక్తి ఉన్న వ్యక్తులు ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ www.cotcorp.org.in లోకి లాగిన్ అవ్వడం ద్వారా, ఆపై “రిక్రూట్‌మెంట్” లింక్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తును ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. మరే ఇతర విధానంలోనూ దరఖాస్తులు స్వీకరించబడవు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ 09/07/2026న ప్రారంభమై 24/07/2026న ముగుస్తుంది, ఆ తర్వాత వెబ్-లింక్ నిలిపివేయబడుతుంది

ముఖ్యమైన తేదీ వివరాలు

•ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ నుండి: 09.07.2026 తేదీన ఉదయం 10.00 గంటల నుండి

•ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ మరియు సమయం : 24.07.2026 రాత్రి 23.55 గంటల వరకు

🛑ShortNotification Pdf Click Here

🛑Old Notification 2025 Pdf Click Here

🛑Official Website Click Here

🛑Apply Online Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *