కేంద్రం రైతులకు శుభవార్త.. మరో ఐదేళ్లు అకౌంట్లోకి రూ.6,000/-..PM కిసాన్ పొడిగింపు.. PM Kisan scheme 2026
PM Kisan scheme 2026 extended Rs 6,000 in account for another five years Latest News : రైతులకు భారీ శుభవార్త. కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు రూ.6,000/- ఆర్థిక భరోసా ఇచ్చే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తూ కేంద్రం క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు.

•2031 వరకు రైతన్నకు రూ.6,000/- ఆర్థిక సహాయం అందుతుంది.
•శుక్రవారం క్యాబినెట్ సమావేశంలో ఐదేళ్ల కోసం రూ.3,15,614 కోట్లు కేటాయించారు.
• పియం కిసాన్ ద్వారా సంవత్సరంలో రూ.6000/- ఆర్థిక సహాయం యధావిధిగా కొనసాగుతుంది.
అన్నదాతలకు కేంద్రం భారీ శుభవార్త తెలియజేశారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2019 లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా సంవత్సరంలో అర్హులైన రైతులు అకౌంట్ లో రూ.6,000/- అనగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2000/- చొప్పున DBT ఆధార్ అనుసంధానమైన బ్యాంకు ఖాతాకు జమ చేస్తున్న సంగతి తెలిసినదే. తాజాగా ఈ పథకానికి రూ.3,15,614 కోట్లను కేటాయించింది. ఈ సమయాన్ని మరో ఐదేళ్లు పెంచుతూ రైతులకు ఆర్థిక సహాయం పథకం 2031 వరకు పాడగిస్తున్నారు. అలాగే జల వనరులపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసి భారీగా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రధానమంత్రి సూర్య సరో వర్ యోజన పేరుతో కొత్త పథకాన్ని క్యాబినెట్ ప్రకటించారు. దీనికోసం రూ.5,070 కోట్లు కేటాయించారు. దేశీయంగా చమురు గ్యాస్ ఉత్పత్తి పెంచడానికి రూ.84,084 కోట్లు సముద్ర మంథన్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఆమోదం తెలిపారు. ఇవే కాకుండా మరిన్ని రూ.4,41,209 కోట్ల విలువైన పథకాలకు ఆమోదం ముద్ర వేశారు.
2031 వరకు అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6000/- చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు పిఎం కిషన్ పథకం మరో ఐదేళ్లు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అర్హులైన రైతులందరూ రైతు భరోసా కు వెళ్లేసి ఈ కేవైసీ కంప్లీట్ చేయండి. అలా చేయడం వల్ల పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు డైరెక్ట్ గా రైతుల ఖాతాలోకి వస్తుంది.


