AP Mission Vatsalya Scheme 2026 : విద్యార్థులకు శుభవార్త.. ఏపీ లో ఆ పిల్లలకు నెలకు ₹4000/- ఆర్థిక సహాయం… పూర్తి వివరాలు
AP Mission Vatsalya scheme 2026 Apply Now : ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు శుభవార్త చెప్పారు.. ఆ పిల్లలకు నెలకు రూ.4000/- ఇచ్చే విధంగా మిషన్ వాత్సల్య పథకానికి దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. ఈ పథకం ద్వారా పిల్లల చదువు, భవిష్యత్తు, పోషణ అండగా నిలిచే ఉద్దేశంతో ప్రవేశపెట్టారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనాధ పిల్లలకు నెలకు రూ.4000/- చొప్పున ఇచ్చేందుకు మిషన్ వాత్సల్య పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలకే కాకుండా ఈ సంవత్సరం పేరెంట్స్ లో ఎవరో ఒకరు లేని పిల్లలు, విడాకులు జంటలు, యాసిడ్ బాధితులు & ప్రాణాంతక వ్యాధిగ్రస్థుల పిల్లలకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిషన్ వాత్సల్య ద్వారా పిల్లలకు ఆర్థిక సహాయం నెలకు 4000 ఇచ్చే విధంగా ఆదేశాలు జారీ చేశారు.
పిల్లల వయసు 31 మార్చి 2026 నాటికి 18 ఏళ్ల లోపు ఉండాలి. 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలే దీనికి అర్హులు. ఇందుకు గాను దరఖాస్తు అంగన్వాడి సిడిపిఓ ను సంప్రదించి వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ పథకం ద్వారా నెల నెల అమౌంట్ కాకుండా, ఆరు నెలలకు ఒకసారి 24,000/- చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. సంవత్సరం మొత్తంలో విద్యార్థులకు రూ.48 వేలు పొందే అవకాశం ఉంటుంది. ఈ మిషన్ వాత్సల్య పథకం కింద కేంద్ర ప్రభుత్వం 60 శాతం రాష్ట్ర ప్రభుత్వం 40% ఆర్థిక సహాయం అందిస్తున్నారు. పై చెప్పిన అర్హత కలిగిన అభ్యర్థులు ఉన్నట్లయితే తమ దగ్గర ఉన్న ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం అధికారులను, CDPO అధికారులు సంప్రదించి వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నారు.


