మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ పంపిణీ.. నేడే పథకం ప్రారంభం | Free Sewing Machines Scheme

మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ పంపిణీ.. నేడే పథకం ప్రారంభం | Free Sewing Machines Scheme

Today Telangana Government launch Free sewing machines Scheme 2026 Minister Ponnam Prabhakar : మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశలో ప్రభుత్వం, ఉచిత కుట్టు మిషన్ పంపిణీ & మిల్లింగ్ లో అవకాశం కల్పిస్తూ ప్రభుత్వ కీలక నిర్ణయం. మహిళలకు డబుల్ గుడ్ న్యూస్..

తెలంగాణ ప్రభుత్వం మహిళలకు స్వయం ఉపాధి కల్పన కల్పించే ఉద్దేశంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. బీసీ మహిళలకు ఉచితంగా ఆటోమేటిక్ కుట్టుమిషన్ అందించే పథకాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 1000 మిషన్లు చొప్పున అర్హులైన BC మహిళలకు పంపిణీ చేస్తామని తెలిపారు. 100% సబ్సిడీతో మహిళలపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ఉపాధి యంత్రాలని అందజేస్తామని తెలిపారు. ఆటోమెటిక్ కుట్టు మిషన్ ప్రభుత్వం ఇస్తున్నారు, దీంతో వేగంగా తక్కువ టైంలో ఎక్కువ దుస్తులు కొట్టడానికి అనుకూలంగా ఉంటుందని తెలిపారు. దీని ద్వారా మహిళలు గృహంలోనే ఉంటూ నెలకు 10,000/- నుంచి 20,000/- మధ్యలో ఆదనంగా రాబడి వచ్చే అవకాశం ఉంటుంది.

తెలంగాణ బీసీ మహిళ ఆర్థిక సమృద్ధి, స్వయం ఉపాధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం మహిళా స్వశక్తితో నిలబడాలని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉచితంగా ఆటోమేటిక్ కుట్టు మిషన్ అందజేయన్నారు. ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క నియోజకవర్గానికి 1000 చొప్పున మొత్తం 1,19,000 మందికి అర్హులైన బీసీ మహిళలకు ఈ యంత్రాంగం పంపిణీ చేస్తామని తెలిపారు. దీనికి సంబంధించి ఈరోజు గురువారం సచివాలయంలో బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు పంపిణీ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభిస్తున్నారు. దీనికి సంబంధించి వయస్సు, ఆదాయ పరిమితులు దరఖాస్తు విధానము తదితర వివరాలు ఈ రోజు మీకు ప్రకటిస్తామని తెలిపారు.

ఉచిత కుట్టు మిషన్ కావాలనుకుంటే BC కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి. వయసు 18 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండాలి. కొత్తగా తీసుకున్న Passport Size, ఆధార్ కార్డు, నివాస ధ్రువీకరణ పత్రం తదితర డాక్యుమెంట్ కావాల్సి వస్తుంది. మరో ఒకవైపు ఉద్దేశపూర్వకంగా బకాయిలు చెల్లించని రైస్ మిల్లుల స్వాధీనం చేసుకోవాలని మహిళా సంఘాలకు అప్పగించాలని అంశాలను పరిశీలించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *