10వ తరగతి ఉత్తీర్ణత తో మిషన్ శక్తి పథకం కింద రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్.. పూర్తి వివరాలు ఇవే

10వ తరగతి ఉత్తీర్ణత తో మిషన్ శక్తి పథకం కింద రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్.. పూర్తి వివరాలు ఇవే

DHEW MTS Out Sourcing notification 2026 : తెలంగాణ ప్రభుత్వం, మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, నల్లగొండ జిల్లాలో “మిషన్ శక్తి పథకం” క్రింద ఏర్పాటు చేయబడిన “డిస్ట్రిక్ట్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్” లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన డిస్ట్రిక్ట్ మిషన్ కో- ఆర్డినేటర్ (1), జెండర్ స్పెషాలిస్టు (2) మరియు మల్టీ టోస్కీ స్టాఫ్ (MTS)(1) అభ్యర్థుల దరఖాస్తులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తుదారులు ఆహ్వానిస్తున్నారు. ఈ జాబ్స్ కి ₹15600/- to ₹38,500/- మధ్యలో ఇస్తారు. ఈ నోటిఫికేషన్ కోసం తేదీ 16-11-2026 to 21.11.2026 సాయంత్రం 5.00 గంటల లోపు సమర్పించుకోవలెను.

పోస్టులు వివరాలు

• డిస్ట్రిక్ట్ మిషన్ కో- ఆర్డినేటర్ : (1)

• జెండర్ స్పెషాలిస్టు : (2)

• మల్టీ టోస్కీ స్టాఫ్ (MTS) : (1)

అర్హత

డిస్ట్రిక్ట్ మిషన్ కో- ఆర్డినేటర్ : ప్రాధాన్యంగా సాంఘిక శాస్త్రాలు/జీవ శాస్త్రాలు/పోషకాహారం/వైద్యం/ఆరోగ్య నిర్వహణ/సాంఘిక సేవ/గ్రామీణ నిర్వహణలో పట్టభద్రులు. అనుభవం: సంబంధిత రంగంలో ప్రభుత్వ/ప్రభుత్వేతర సంస్థలతో పనిచేసిన కనీసం 3 సంవత్సరాల అనుభవం.

జెండర్ స్పెషాలిస్టు : సాంఘిక కార్యం/ ఇతర సాంఘిక విభాగాలలో పట్టభద్రులు. పోస్ట్-గ్రాడ్యుయేట్లకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అనుభవం: లింగ సమానత్వంపై దృష్టి సారించిన అంశాలలో ప్రభుత్వ/ప్రభుత్వేతర సంస్థలతో పనిచేసిన కనీసం 3 సంవత్సరాల అనుభవం

మల్టీ టోస్కీ స్టాఫ్ (MTS) : ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10+2 విధానంలో 10వ తరగతి ఉత్తీర్ణత.

వయోపరిమితి : జూలై 2026 నాటికి దరఖాస్తుదారు వయస్సు 21-35 సంవత్సరాల మధ్య ఉండాలి (ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది).

రిక్రూట్‌మెంట్ రకం : అవుట్ సోర్సింగ్

ఎంపిక విధానం : ఎంపిక చేసిన అభ్యర్థులకు మాత్రమే సమాచారం అందించబడుతుంది. అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూల ద్వారా జరుగుతుంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి : ఈ ఉద్యోగాలకు కావాల్సిన విద్యార్హతలు, వయస్సు మరియు దరఖాస్తు ఫారము కొరకు వెబ్సైట్ (https://nalgonda.telangana.gov.in) ను సంప్రదించగలరు. పూర్తి చేసిన దరఖాస్తులను ఫారములను కావలసిన దృవపత్రాలను జతచేసి జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం మహిళా, శిశు, దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ, సంక్షేమ భవన్, కలెక్టరేట్, నల్లగొండ నందు తేదీ 16-11-2026 2 21.11.2026 సాయంత్రం 5.00 గంటల లోపు సమర్పించుకోవలెను. పోస్టు ద్వారా ఆలస్యముగా వచ్చిన దరఖాస్తు ఫారములు తిరస్కరించబడును.

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *