ఏపీ లో మహిళలకు భారీ శుభవార్త… ఏపీ డ్వాక్రా మహిళలకు సబ్సిడీ ఎలక్ట్రిక్ ఈ-ఆటోలు, స్కూటర్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఆఫర్ | AP DWCRA Women Subsidy
AP DWCRA EV Autos And Scooty Women subsidy : ఆంధ్రప్రదేశ్ మహిళలకు భారీ శుభవార్త. ఆంధ్రప్రదేశ్ డ్వాక్రా మహిళలకు రూ.1 లక్ష రూపాయల సబ్సిడీతో ఈ ఆటోలు సబ్సిడీ అందుతున్న అందిస్తున్నారు. అలాగే ఈ స్కూటర్లు కూడా రూ.12,000 సబ్సిడీతో మీ కోసము లేదా మీ ఇంట్లో వారి కోసం సొంత వ్యాపారం చేసి నెల స్థిరమైన ఆదాయం పొందాలనుకున్న వారికి ఇది సువర్ణవకాశం.

ఏపీ లో డ్వాక్రా (SHG) మహిళలు మరియు వారి కుటుంబ సభ్యులకు ఈ ఆటోలపై లక్ష రూపాయల సబ్సిడీ ఈ స్కూటర్ల పై 12 వేల సబ్సిడీ పొందవచ్చు. రుణం మరియు వడ్డీ కోసం ప్రైవేట్ ఫైనాన్స్ అవసరం లేదు. MEPMA ద్వారా బ్యాంకు లోన్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఎందుకు గాను అభ్యర్థులు సచివాలయం లేదా మెప్మా అధికారుల ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. తక్కువ వడ్డీతో బ్యాంకు ద్వారా రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది. ఆసక్తికరమైన ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఎందుకు కావలసిన డాక్యుమెంట్ వివరాలు చూసినట్లయితే ఆధార్ కార్డు, డ్వాక్రా పాస్ బుక్, బ్యాంకు ఖాతా మరియు లైసెన్స్ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు.
లక్ష రూపాయల రాయితీతో ఎలక్ట్రిక్ ఆటోలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు అందిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో 4.5 లక్ష రూపాయలు విలువ చేసే ఈ ఆటోల రాయితీ ఫోను కేవలం 3.5 లక్ష రూపాయలు చెల్లించాలి. ఈ మొత్తాన్ని కూడా బ్యాంకు ద్వారా అతి తక్కువ వడ్డీకి రుణం అందిస్తుంది. దీని ద్వారా మహిళలు స్వయంగా లేదా కుటుంబ సభ్యుల సహాయంతో ఈ ఆటోలను నడిపించి ఆర్థికంగా ఎదగవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. ప్రభుత్వమే నేరుగా రుణాలు సహకరిస్తుంది. MEPMA కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలక్ట్రిక్ ఆటోలే కాకుండా ఎలక్ట్రిక్ స్కూటీ లపై కూడా 12,000/- వేల సబ్సిడీ లభిస్తుంది. రోజువారి ప్రయాణాలు లేదా చిన్నపాటి పనుల కోసం స్కూటీలు ఎంతగానో ఉపయోగపడతాయి. తక్కువ పెట్టుబడి తో సొంత వాహనం సమకూర్చుకోవడానికి ఇది సువర్ణ అవకాశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెప్మా అధికారం సంప్రదించి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన ప్రతి ఒక్క మహిళలకు ఈ సబ్సిడీ ఉపయోగపడుతుంది.


