New Ration Card: రేషన్ దారులకు శుభవార్త.. కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులో తొమ్మిది సెక్యూరిటీ ఫీచర్లు. ఎలా ఉంటాయో తెలుసా
Telangana New PVC QR Code Ration Card 2026 Latest News : తెలంగాణ రాష్ట్రంలో రేపు నుంచి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నారు. డేటా చోరీకి చెక్ పెట్టేలా క్యూఆర్ కోడ్ తో సీఎం, మంత్రి ఉత్తమ ఫోటోలతో రూపకల్పన.. రేపు సంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభం రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది.

తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డులు ఈనెల 15 నుంచి 15 రోజులపాటు రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వనన్నది. అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డు 1.05 కోట్ల మందికి స్మార్ట్ రేషన్ కార్డులు, 2.50 లక్షల మందికి కొత్త పెన్షన్లు అందజేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ లో ముఖ్యంగా ఒంటరి మహిళలకు, దివ్యాంగులకు, చేనేత & గీత కార్మికులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మోడల్ కార్డులను రిలీజ్ చేసింది. కార్డులపై ఓవైపు సీఎం రేవంత్, మంత్రి ఉత్తం ఫోటోతో రేషన్ కార్డులు నెంబరు, కుటుంబ యజమాని పేరు, రేషన్ షాప్ నెంబరు వంటి వివరాలు ఉంటాయి. మరోవైపు హోలోగ్రామ్, క్యూఆర్ కోడ్ తో పాటు విలేజ్, మండలం, జిల్లా & అడ్రస్ వంటి వివరాలు ఉంటాయి.
తెలంగాణ స్మార్ట్ రేషన్ కార్డులు 9 సెక్యూరిటీ ఫ్యూచర్లు ఉన్నాయి. అందులో ముఖ్యంగా కార్డు ఫ్రంట్ సైజులో సివిల్ సప్లయర్ కమిషన్ సంతకం, కార్డు సైజు 12x16mm, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ( రిలీఫ్ అండ్ మైక్రోటేస్ట్), గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఒరిజినల్ డ్యుయల్ హిడెన్ ఇమేజ్, అలాగే తెలంగాణ ఎంబ్లెమ్తో కూడిన వాటర్ మార్క్ లోగో, యూవీ లోగో, ఎన్క్రిప్టెడ్ QR కోడ్- 20x20mm, వలయాలతో కూడిన గిల్లోచే భద్రత ఫ్యూచర్ ను పొందుపరిచారు. ఈ కార్డు ముఖ్యంగా డిజిటల్ వెరిఫికేషన్ కు వీలుగా తీర్చిదిద్దారు. రేషన్ కార్డు స్థాయిలో ఇచ్చే స్మార్ట్ కార్డు ద్వారా ఇకపై బియ్యం ఇస్తామని తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా నెలకు ఉచితంగా 6 కేజీ బియ్యం అందిస్తున్నామని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి గారు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు, సెప్టెంబర్ & అక్టోబర్ మూడు నెలల బియ్యం ఒకేసారి పొందవచ్చును. ఈ ప్రక్రియ ఆగస్టు 01 నుంచి 15 వరకు పంపిణీ కొనసాగుతుంది అని తెలిపారు. రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు లు రేషన్ డీలర్ వద్ద పొందవచ్చును.

🛑 శాంపుల్ రేషన్ కార్డు ఎలా ఉందో చూస్తారా క్లిక్ హియర్

