AP ఇంటర్ ఫలితాలు విడుదల | AP Intermediate Results Date 2025 | AP Inter Results 2025
AP Inter Results 2025 : విద్యార్థులకు శుభవార్త..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ 1st & 2nd రిజల్ట్స్ వస్తున్నట్లు అప్డేట్ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో మొదట మార్చి 17 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు మూల్యాంకనం షెడ్యూల్‌ను ఖరారు చేసింది. అయితే, తరువాత అనేక మార్పులు చేసి చివరికి ఏప్రిల్ 3వ తేదీ నాటికి పూర్తిచేయాలని నిర్ణయం తీసుకుంది.

లెక్చరర్లు ఒక రోజులో ఉదయం 15, మధ్యాహ్నం 15 మొత్తంగా 30 పేపర్లను మాత్రమే మూల్యాంకనం చేయాలనే నిబంధన ఉంది. కానీ, తాజా నిర్ణయంతో వారికి రోజుకు 45 పేపర్లు దిద్దేలా ఒత్తిడి చేస్తున్నారు. ఈ వేగవంతమైన ప్రక్రియలో త్వరలో మీకు విడుదల అవడం జరుగుతుందని తెలియజేస్తున్నారు. ఇదే విధంగా జరిగితే ఏప్రిల్ మూడో లేదా నాలుగో వారంలో ఫలితాలు విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది.
ఇంటర్ ఫలితాలను నేరుగా వాట్సాప్ ద్వారా అందించడమంటే విద్యార్థులకు చాలా సౌలభ్యంగా ఉంటుంది. ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు ఎక్కువ ఉపయోగపడుతుంది, ఎందుకంటే వారికి ఎప్పుడూ ఇంటర్నెట్ లభ్యత ఉండకపోవచ్చు. విద్యార్థులు ఇంటర్ ఫలితాలను రెండు విధాలుగా చూడవచ్చు. కూటమి ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన వాట్సప్ గవర్నెన్స్ సేవల ద్వారా విద్యార్థులు తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నట్లుగా, ఇప్పుడు ఫలితాలు కూడా నేరుగా వాట్సాప్ ద్వారా పొందవచ్చు.
ఫలితాలు విడుదలైన వెంటనే, 20-30 నిమిషాల్లో విద్యార్థుల ఫోన్ నంబర్లకు ఫలితాలను పంపించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే, సాంకేతిక కారణాలతో ఆలస్యమైనట్లయితే, విద్యార్థులు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి తమ రోల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి ఫలితాలను చూడవచ్చు. ఈ రెండు మార్గాల్లో విద్యార్థులు తమకు అనువుగా ఉన్న పద్ధతిని ఎంచుకుని ఫలితాలను సులభంగా పొందవచ్చు. ఏప్రిల్ 3 లేదా 4 వారాల్లో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది.

🛑 Intermediate Results 1St Link

