AP EAPCET Results 2026 Release Date : ఏపీ ఈఏపీసెట్ ఫలితాల విడుదలకు..ఎప్పుడంటే?
AP EAPCET Results 2026 Release Date Latest News Today : ఆంధ్రప్రదేశ్ లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మసీ కోర్సుల ప్రవేశాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ 2026 ఫలితాల విడుదలపై కీలక సమాచారం వచ్చింది. ఈనెల 27 నుంచి 30 తేదీ మధ్యలో ఫలితాలు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఎంసెట్ ర్యాంకింగ్ లో ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజ్ ఉండడంతో ఫలితాలు వెలువడిలో ఆలస్యమైంది. అయితే ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు ఈనెల 18వ తేదీన విడుదలయ్యాయి. కానీ CBSE లో ఇంటర్మీడియట్ రీవెరిఫికేషన్ & రీవాల్యుయేషన్ ఫలితాలు 85% విడుదలయ్యాయి. మిగిలిన ఫలితాలు త్వరలో విడుదల చేయనన్నారు. ఈ కారణంగా ఎంసెట్ ఫలితాలు విడుదల చేయలేదు. CBSE విద్యార్థులు ఈ సంవత్సరం 8000 పైన ఎంసెట్ పరీక్షలకు హాజరయ్యారు. CBSE మార్క్స్ వెలువడిన వెంటనే ఒకటి రెండు రోజులలో ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల కావునన్నాయి.

ఏపీ ఈఏపీసెట్ రాసిన విద్యార్థులకు ముఖ్య గమనిక డిక్లరేషన్ ఫామ్ సమర్పించుకోవడానికి చివరి తేదీ జూన్ 27 ప్రకటించారు. ఎంసెట్ రాసిన అభ్యర్థులు డిక్లరేషన్ ఫామ్ ని 27 జూన్ 2026 సాయంత్రం ఐదు గంటల లోపు సమర్పించుకోవాలని ఎంసెట్ కన్వీర్ ప్రొఫెసర్ ఎన్ మోహన్ రావు గారు సూచించారు. CBSE రీ వెరిఫికేషన్ & రీవాల్యుయేషన్ అనంతరం విడుదలైన సవరించిన ఫలితాల మార్కులు పెరిగిన అభ్యర్థులు తప్పనిసరిగా సీబీఎస్సీ రివెరిఫికేషన్ డిక్లరేషన్ పూర్తి చేయాలని ఎంసెట్ కన్వీర్ కార్యాలయంలో జూన్ 25న ఓ ప్రకటన విడుదల చేశారు.
ఏపీ ఈఏపీసెట్ రాసిన సీబీఎస్ఈ విద్యార్థులు తప్పనిసరిగా ఈనెల 27 లోపల రి వెరిఫికేషన్, రీకౌంటింగ్ సంబంధించి డిక్లరేషన్ ఫామ్ ని అప్లోడ్ చేయాలి.

🛑AP EAPCET – 2026 : DECLARATION OF QUALIFYING EXAMINATION MARKS
🛑 Official Website Click Here

