AP August Pension : ఆంధ్రప్రదేశ్ లో ఒకరోజు ముందే జులై 31 పెన్షన్ పంపిణీ
AP August Pension distribution a day early : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ దారులకు గుడ్ న్యూస్ తెలిపారు.. ఒకరోజు ముందే జూలై 31 తేదీన పెన్షన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఉత్తరాంధ్ర ఆరు జిల్లాలలో ఈసారి ఒకరోజు ముందే జూలై 31న పెన్షన్ పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఆగస్టు 1న పీఎం మోదీ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం రానున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలు భారీగా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా పెన్షన్ ముందుగానే పంపిణీ చేయాలని సీఎం గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మిగతా జిల్లాల్లో ఒకటో తేదీన పంపిణీ కొనసాగుతుందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర ఆరు (శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు) జిల్లాలలో జూలై 31 తేదీన పెన్షన్ పంపిణీ చేస్తారని అధికారులు తెలియజేశారు.

