Good News : రాష్ట్రంలో కొత్తగా పథకం.. రేపటి నుంచే.. పట్టణాలలో ఇందిరమ్మ ఇళ్లు.. రేపే ప్రారంభం | Indiramma Houses Latest News
Indiramma Houses 2026 Latest News : తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు పట్టణ ప్రాంతాలపై ప్రాధాన్యత ఇచ్చింది. పట్టణాల్లోని తక్కువ ఆదాయ వర్గాల (LIG) కోసం ఇందిరమ్మ ఇళ్లు – ఎల్ఐజి హౌసింగ్ టవర్స్ ఈ పథకాన్ని రేపే తెలంగాణ ప్రభుత్వం ప్రారంభిస్తుంది. హైదరాబాదులో క్యూర్ (Core Urban Region) లో మొదలయ్యే ఇందిరమ్మ ఇళ్లు పథకం ద్వారా అధునాతిక అపార్ట్మెంట్ తరహా గృహాలను అందుబాటులోకి తెస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలిపారు. ఈ పథకానికి దరఖాస్తు విధానం, అర్హతలు రేపు ప్రకటిస్తామని తెలిపారు.

తెలంగాణలో పట్టణ ప్రాంతాల్లో పేదల కోసం హౌసింగ్ బోర్డ్ ద్వారా 2BHK తరహాలలో ఇళ్లు నిర్మాణం చేపట్టనున్నది. ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ పథకానికి సంబంధించి రేపు ప్రారంభం కానున్నది. ఇందుకుగాను గృహ నిర్మాణ అనుమతులకు సింగిల్ విండో కమిటీని ఏర్పాటు చేసింది. దీని ద్వారా అనుమతులలో జోక్యం లేకుండా సేవలు వేగంగా అందుతాయి. ఈ స్కీం ద్వారా నిర్మించే ఇళ్లులకు ప్లానింగ్, బిల్డింగ్ పర్మిషన్ ఛార్జీల నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్లుకు తక్కువ ధరకే స్టీల్, సిమెంటు, ఇతర సామాగ్రి ధరలు తగ్గించాలని పరిశ్రమలను యాజమాన్యాలను ప్రభుత్వం కోరింది. ఈ మేరకు ఆయా కంపెనీల ప్రతినిధులతో మంత్రుల పొంగులేటి, శ్రీనివాస్ రెడ్డి & దధిళ్ల శ్రీధర్ బాబు చర్చలు జరిపారు. ప్రభుత్వ విజ్ఞప్తి పై వారు సానుకూలంగా స్పందించి తక్కువ ధరకే సామాగ్రి ఇచ్చేందుకు సుముఖత తెలిపారని తెలుస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో సిమెంటు బస్తా ధర రూ.330 వరకు ఉండగా, రూ.220కే సరఫరా చేయాలని ప్రభుత్వం కోరింది. ఆ రేట్లకు ఇస్తే కంపెనీ నష్టపోతుందని, రూ.270కి ఇస్తామని కంపెనీ ప్రతినిధులు చెప్పినట్టు సమాచారం. త్వరలోనే తుది చర్చలు జరిపి రేట్లు ఖరారు చేస్తున్నట్లు తెలుస్తుంది.


