Talliki Vandanam Scheme : ఏపీ ప్రభుత్వం మరో కీలక ప్రకటన.. ఇలా చేస్తేనే వీరికి అకౌంట్లో డబ్బులు..
Andhra Pradesh Talliki Vandanam Scheme 2026 Release Date Latest News : తల్లికి వందనం పథకం పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఇంకా టైం అనేది రెండు రోజులు మాత్రమే ఉంది. అంతలోపే బ్యాంక్ అకౌంట్, NPCI మ్యాపింగ్ పై ప్రభుత్వం అధికారులు కీలక ప్రకటన చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెలలోనే తల్లికి వందనం నిధులు జమ చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. 2026-27 సంవత్సరానికి సంబంధించి సొమ్ము ఈనెల 16,17, 18వ తేదీన లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాకు డైరెక్ట్ గా డబ్బులు చేయనున్నారు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు, ప్రభుత్వ మరియు ప్రైవేటు స్కూల్ మరియు కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది. విద్యార్థి తల్లి ఖాతాకు డైరెక్ట్ గా బ్యాంకుకు జమ చేయనున్నారు. తల్లికి వందనం నిధులు కింద ఈ సంవత్సరం రూ.15000/- అందిస్తుండగా స్కూల్ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.2000/- తీసుకుంటుంది మిగతా రూ.13000/- తల్లి ఖాతాకు డైరెక్ట్ గా పంపిణీ చేయనున్నారు.
తల్లికి వందనం సంబంధించి ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ 1st ఇయర్ చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. అదేంటంటే విద్యార్థులు తప్పనిసరిగా బ్యాంకు ఖాతా ఉండాలని సూచిస్తున్నారు. ఇది కేవలం ఎస్సీ విద్యార్థులకు మాత్రమే రూల్ వర్తిస్తుంది. ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకు ద్వారా పాన్ కార్డు లేకపోయినా విద్యార్థులు తమ పేరుతో బ్యాంక్ కొన్ని ఓపెన్ చేయొచ్చు. ఆధార్ కార్డు డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ తీసుకొని వెళ్లి ఖాతా ఓపెన్ చేసుకోవచ్చు. పాత ఓపెన్ చేయడానికి కేవలం 200 రూపాయలు మాత్రమే డిపాజిట్ తో పోస్టల్ పేమెంట్ బ్యాంకు తెరవడం జరుగుతుంది. అలాగే 18 సంవత్సరాలు లోపు విద్యార్థులకు సంబంధించి తల్లిదండ్రుల బయోమెట్రిక్ వెరిఫికేషన్ చెయ్యొచ్చు. అలాగే తల్లిదండ్రుల ఆధార్ కార్డు లింక్ అయినా మొబైల్ నెంబరు వచ్చే ఓటిపి ఎంటర్ చేసి విద్యార్థుల బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఎన్పీసీ మ్యాపింగ్ కూడా చేసుకోవాలి. దీంతో తల్లికి వందనం ఎటువంటి ఇబ్బంది లేకుండా నిధులు విడుదల చేస్తానని డైరెక్ట్ గా ఎస్సీ విద్యార్థులకు తల్లికి వందనం నిధులు అందుతాయి. ఎస్సీ విద్యార్థులకు చాలామందికి బ్యాంక్ అకౌంట్ లేదు. విద్యార్థులు తప్పనిసరిగా పోస్టల్ పేమెంట్ బ్యాంకులో అకౌంట్ తెరిస్తే 24 గంటలు ఎంపీసీ అనుసంధానం అవుతుంది. ఎస్సీ విద్యార్థులు తప్పనిసరిగా వెంటనే అకౌంట్ ఓపెన్ చేయండి.

మిగిలిన విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క తల్లి బ్యాంకు అకౌంటు కి ఆధార్ లింక్ అయి ఉండాలి, అలాగే ఈ ఈకేవిసి లింక్ అయి ఉండాలి. NPCI మ్యాపింగ్ కూడా తప్పనిసరిగా ఉండాలి. త్వరలోనే స్వర్ణ గ్రామం-స్వర్ణ వార్డు సచివాలయాల్లో తల్లికి వందనం ఎలిజిబులిటీ లిస్టు ప్రదర్శించడం జరుగుతుంది.

