తల్లికి వందనం పథకం కీలక ప్రకటన… ఆ విద్యార్థులకు బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి.. అప్పుడే రూ.13,000/- పడుతుంది | Talliki Vandanam Scheme
Talliki Vandanam Scheme 2026 AP Government Alert Talliki Vandanam SC Students Must Open Bank Account : ఆంధ్రప్రదేశ్ త్వరలో అమలు చేస్తున్న తల్లి వందనం పథకానికి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. 2026-27 సంవత్సరంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్ పొందిన అర్హులైన ఎస్సీ విద్యార్థులు తమ పేరు మీద కొత్త బ్యాంక్ అకౌంట్ లేదా పోస్టల్ అకౌంట్ ప్రారంభించాలి దానితో పాటు NPCI మ్యాపింగ్ అనేది అయ్యుండాలి. ఇప్పటివరకు చాలామంది అకౌంట్ ప్రారంభించలేదు వెంటనే ప్రారంభించాలని అధికారులు సూచిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఈ నెలలో తల్లికి వందనం నిధులు విడుదల చేసేందుకు సర్వసిద్ధమయ్యాయి. ఈనెల 16,17, 18 వ తేదీన తల్లికి వందనం డబ్బులు విడుదల చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసినదే, అలాగే క్యాబినెట్ లో కూడా ఆమోదం లభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్ మరియు కాలేజీలో ఉన్న విద్యార్థులకు తల్లుల బ్యాంకు అకౌంట్ లో 15వేల రూపాయలు జమ కానున్నది. అందులో 13,000 డైరెక్టుగా తల్లి ఖాతాలోకి 2,000 పాఠశాల నిర్వహణ అనేది జమవుతాయి. ఎస్సీ విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చింది. 18 సంవత్సరాల లోపు వయసు కలిగిన విద్యార్థులు తమ తల్లి లేదా తండ్రి యొక్క బయోమెట్రిక్ యూస్ చేసుకోవచ్చు. అలాగే ఓటీపీ కోసం ఆధార్ కార్డు అనుసంధానమైన మొబైల్ నెంబరు కావాలి.
ప్రస్తుతం ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకు ద్వారా పాన్ కార్డు అవసరం లేకుండానే విద్యార్థుల పేర్లతో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవుతున్నాయి. ఈ కథ ప్రారంభించే సమయంలో కనీసం 200 రూపాయలు జమ చేస్తే సరిపోతుంది. ఇందుకుగాను డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్, టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో & ఆధార్ కార్డు తీసుకొని వెళ్లి IPPB లో అకౌంట్ ని ఓపెన్ చేసుకోవచ్చు. అప్పుడే NPCL బ్యాంకు అకౌంట్ కి మ్యాపింగ్ చేసి ఉండాలి. అలా చేస్తే పూర్తిగా 24 గంటలు యాక్టివా అయిపోతుంది. తప్పనిసరిగా అకౌంట్ లేని విద్యార్థులు వెంటనే ఓపెన్ చేయాలని తెలుపుతున్నారు.

తల్లివందన పథకం పొందాలనుకున్న తల్లుల బ్యాంకు ఖాతా ఆధార్ లింక్ తప్పనిసరిగా ఉండాలి. అలా లేనట్లయితే పథకం అర్హులైనప్పటికీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడవు. కావున తల్లికి వందనం రావాలనుకుంటే ఆధార్ కార్డుతో బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి. అలాగే e-KYC అయి ఉండాలి, NPCI మ్యాపింగ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే తల్లికి వందనం నిధులు విడుదల చేసిన వెంటనే మీ అకౌంట్లో డబ్బులు పడతాయి.

