Telangana Anganwadi Jobs : మహిళలకు గోల్డెన్ ఛాన్స్.. 33 జిల్లాలలో 3100 టీచర్లు, 12,882 సహాయక ఉద్యోగులకు జిల్లాల వారీగా ఉద్యోగ నియామక ప్రకటన
TG Anganwadi Teacher & Anganwadi Helper Recruitment 2026 Apply Now : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో 15,982 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జిల్లాల వారీగా నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. అర్హత కలిగిన మహిళ అభ్యర్థుల నుంచి ఆయా జిల్లాలో ఐసిడిసి ప్రాజెక్టు వారి ఖాళీల గుర్తింపు శిశు సంక్షేమ శాఖ జిల్లాల వారిగా నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. ఇందులో టీచర్లు 3,100 పోస్టులు, సహాయక 12,882 భర్తీ చేస్తున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్, నిజామాబాదు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, ములుగు & సూర్యాపేట తదితర జిల్లాలలో నోటిఫికేషన్ విడుదల చేశారు. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 25 జులై లోపు https://mis.tgwdcw.in/ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

అంగన్వాడీ పోస్టులకు నేడే నోటిఫికేషన్ విడుదల. ఈరోజు సూర్యాపేట 131 టీచర్ మరియు ఆయా ఉద్యోగాలు భర్తీ కోసం ఆన్లైన్లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 131 పోస్టుల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే ఈనెల 13 నుంచి 24వ తేదీ వరకు దరఖాస్తు స్వీకరిస్తున్నారు. ఈ ఉద్యోగాలకు మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా కనీసం విద్యార్హత ఇంటర్మీడియట్ ఉండాలి. ఆయా పోస్టులకు గిరిజన ప్రాంతాల్లో ఇంటర్ అభ్యర్థులు లేకున్నట్లయితే SSC చదివిన వారికి అవకాశం కల్పిస్తారు. అభ్యర్థి ఈ అంగన్వాడి కేంద్రం కైతే దరఖాస్తు చేసుకుంటున్నారు ఆ గ్రామం, హెబిటేషన్, వార్డు నివాసులై ఉండవలసి ఉంటుందని ప్రకటించారు. ఎంపిక పూర్తిగా విద్య మెరిట్ ఆధారంగా జిల్లా సెలక్షన్ కమిటీ నిర్వహణ ఆధారంగా ఇంటర్వ్యూ ఆధారంగా రోస్టర్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు. 01/07/2026 నాటికి 18 సంవత్సరములు నుండి 35 సంవత్సరములలోపు ఉండాలి.
అభ్యర్ధుల ఎంపిక క్రింది ప్రమాణాల ఆధారంగా జరుగుతుంది: 70 మార్కులు ఇంటర్మీడియట్ విద్య అర్హత మెరిట్ ఆధారంగా, 5 మార్కులు వితంతువులు, 10 మార్కులు ఆనాథలు 5 మార్కులు దివ్యాంగులు & 10 మార్కులు జిల్లా ఎంపిక కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూ దరఖస్తు http://wdcw.tg.nic.in వెబ్ సైట్ నందు మాత్రమే అప్లై చేయగలరు.
ఆన్లైన్లో అప్లోడ్ చేయావలసిన ద్రువపత్రాలు (Scanned copies) : పుట్టిన తేది / వయస్సు దృవీకరణపత్రము (SSC certificate), విద్యార్హత దృవీకరణపత్రము, కుల దృవీకరణ పత్రము తహసిల్దార్ చే, ఇంటర్/ ఆ పై విద్య అర్హతలు మార్కుల జాబితా, అంగవైకల్యం కలిగిన వారు సదరం సర్టిఫికెట్, నివాస దృవీకరణపత్రము తహసిల్దార్, వితంతువు అయితే భర్త మరణ దృవీకరణపత్రము, ఓటర్ ఐ.డి కార్డ్, ఆధార్ కార్డ్, ఆనాథ అయితే ఆనాద సర్టిఫికేట్, తదితర డాక్యుమెంట్ ఉండాలి.
ముఖ్యమైన తేదీలు:
•దరఖాస్తు ప్రారంభం తేదీ : 13/07/2026
•దరఖాస్తు చివరి తేది : 24/07/2026 వరకు సాయంత్రము 5.00 గంటల వరకు

🛑Notification Pdf Click Here
🛑Vacancy & Roster Pdf Click Here
🛑OFFICIAL WEBSITE CLICK HERE
🛑 APPLY ONLINE LINK CLICK HERE

