New Pensions : చేయూత పెన్షన్ వెరిఫికేషన్ మొదలు… కొత్త పెన్షన్ లపై కీలక నిర్ణయం..
Field verification of applications for Telangana Cheyutha pensions : తెలంగాణలో కొత్త చేయూత పెన్షన్ వెరిఫికేషన్ ప్రారంభమైంది. ప్రతి ఒక దరఖాస్తుదారుని సామాజిక నివాస స్థితి ఆర్థిక పరిస్థితి పెన్షన్ కేటగిరి వెరిఫికేషన్ చేసి యాప్ లో అధికారక నమోదు చేయనున్నారు. ఆ తర్వాత అర్హత జాబితా DRDO కు పంపుతారు. ఫైనల్ గా జాబితాను కలెక్టర్ ఆమోదించగానే మంజూరు చేయడం జరుగుతుంది. వెరిఫికేషన్ ఈనెల 25న పూర్తి చేస్తామని మంత్రి సీతక్క అధికారికంగా ప్రకటన చేశారు.

చేయూత పెన్షన్ వివరాలను మొబైల్ యాప్ లో ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు. యాప్ లో నమోదైన ప్రాథమిక వివరాలు ఆధారంగా అర్హులైన అభ్యర్థుల జాబితా సిద్ధం చేసి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారులకు పంపిస్తారు. డి ఆర్ డి ఓ అధికారులు ఆ జాబితాను పరిశీలించి ఆయా జిల్లా కలెక్టర్ గారికి సమర్పిస్తారు. ఆ తరువాత జిల్లా కలెక్టర్ అప్లికేషన్ పరిశీలించి ఆమోదం ముద్ర వేసి అర్హుల జాబితాను కొత్త చేయూత పెన్షన్ అధికారికంగా మంజూరు చేస్తారు. అనర్హులకు తావు లేకుండా నిజమైన పేదలకు బాధితులకు మాత్రమే ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందజేయాలని ఈ ప్రక్రియ కొనసాగిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల పై కీలక నిర్ణయం తీసుకున్నారు. దివ్యాంగులు ఒంటరి మహిళలు వితంతువులు తదితర రెవిన్యూ కార్యాలయాల్లో ధృవీకరణ పత్రాలు జారీ చేయడంలో ఆలస్యం కావడంతో సర్టిఫికెట్ లేకపోయినా అప్లై చేసుకోవచ్చు అని తెలియజేయడం జరిగింది. కానీ దరఖాస్తుల సమయంలో ఆ పత్రాలను అందజేయాలని తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 15 వరకు అయితే ఉంటుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 25 వరకు దరఖాస్తు వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది.


