చేయూత పెన్షన్లకు అలర్ట్…. 3 రోజులే గడువు Cheyutha Pension Scheme 2026 Latest News
TS Cheyutha Pension Scheme 2026 Apply only 3 days left : తెలంగాణ రాష్ట్రంలో చేయూత పెన్షన్ కు ఇప్పటికే 3.70 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇకపోతే 3 రోజులు మాత్రమే గడువు ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా పెన్షన్ పొందాలనుకున్న అభ్యర్థులకు చేయూత పెన్షన్ కోసం అప్లై చేయాలనుకుంటే ఇంక 3 రోజులు మాత్రమే గడువుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 3.70 లక్షల మంది అప్లై చేసుకున్నారు. వీటిలో అత్యధికంగా వితంతువులు 2.34 లక్షలు, దివ్యాంగులు 93,151 మంది ఉన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 31వ తేదీ లోపు గ్రామంలో పంచాయతీ కార్యదర్శులు, MPDOs వద్ద పట్టణాలలో వార్డు అధికారి లేదా మునిసిపల్ కమిషన్ వద్ద దరఖాస్తు చేసుకోవాలి. లేదా https://cheyutha.telangana.gov.in ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

తెలంగాణ రాష్ట్రంలో సామాజిక భద్ర పెన్షనర్ మరణిస్తే వారి భాగస్వామికి వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నారు. చేయూత పెన్షన్ భాగంగా ఈ ప్రక్రియ అత్యంత వేగవంతంగా చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే దివ్యాంగులు, తలసేమియా బాధితులు చనిపోయిన సహాయం కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండేలా భార్యాభర్తల తక్షణమే పెన్షన్ వర్తించేలా చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
చేయూత పెన్షన్లు అత్యధిక ప్రాధాన్యత వితంతువులకు, దివ్యాంగులకు & వృద్ధులకు ఇవ్వడం జరుగుతుంది. అర్హులు అయితే వెంటనే అప్లై చేసుకోండి. వెంటనే మీకు పెన్షన్ వస్తుంది. తొలి విడుదల లోనే మూడు నుంచి మూడున్నర లక్షల మందికి కొత్త పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నారు. అర్హత విషయానికొస్తే 18 సంవత్సరాలు నిండిన భర్త మరణించిన ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి వారికి వితంతు పెన్షన్ దొరుకుతుంది. ఒంటరి మహిళలకు భర్తతో విడిపోయిన ఏడాది పూర్తయి ఉండాలి. అవివాహిత మహిళలకు గ్రామీణ ప్రాంతాలలో 30 సంవత్సరాలు, పట్టణ ప్రాంతాల 35 సంవత్సరాలు పైబడిన మహిళా అభ్యర్థులు ఉండాలి. దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అందులో 45% వైకల్యం కలిగి ఉన్నవారు అర్హులు. చేనేత కార్మికులకు వైస్ 50 సంవత్సరాలు పైబడి ఉండాలి. పై అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవడానికి అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఈ నెల 31వ తేదీ వరకు మాత్రమే ఉంది.

🛑Cheyutha Pension Scheme 2026Apply Link

