AP Government : నేతన్న భరోసా కింద 25 వేల చొప్పున ఆర్థిక సహాయం..క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
AP Government Netanna Bharosa Scheme 2026 Release Cabinet green signal : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షా, సచివాలయంలో జరిగిన మంత్రివర్గ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ 3168 ప్రభుత్వ ఉద్యోగుల భర్తీకి రాష్ట్ర మంత్రివర్గ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన క్యాబినెట్ లో 25 పైగా అంశాలపై చర్చలు జరిగాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా చేనేత కార్మికులకు నేతన్న భరోసా కింద 25 వేల చొప్పున ఆర్థిక సహాయం ఇవ్వాలని నిర్ణయించారు. గోదావరి పుష్కరాల భద్రత కోసం 50 కోట్ల మంజూరు చేశారు. మార్క్ఫెడ్ (Markfed – Cooperative Marketing Federation) ₹300 కోట్ల రుణానికి సంబంధించి సెంట్రల్ బ్యాంకు గ్యారంటీ ఇచ్చేందుకు అంగీకరించింది. వినికిడి లోపం ఉన్న వారి కోసం బాపట్లలో డిగ్రీ కళాశాల ఏర్పాటు ఓకే చెప్పారు. ప్రభుత్వం పొగాకు రైతుల కోసం తీసుకున్న చర్యలను ప్రభుత్వం ముందుగానే ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రో యాక్టివ్గా మంత్రులు ముందుకెళ్లాలని సీఎం చంద్రబాబు గారు స్పష్టత చేశారు.


