New Ration Card 2026 : e-KYC.. ఈ విషయం తెలుసా… మూడు నెలల కోట ఒకేసారి.. కేంద్రం కీలక నిర్ణయం
New Ration Card e-KYC 2026 Latest News : రేషన్ క కార్డుదారులకు ఈనెల 31 లోగా ఈ కేవైసీ తప్పనిసరిగా చేయాలని కేంద్రం గడువు విధించిన విషయం తెలిసినదే.. ఈ విషయంలో కొంతమంది ఉద్యోగ, వ్యాపార నిమిత్తం వలస వెళ్లిన వారు తమ కార్డు రద్దు అవుతుందేమోనని చాలా ఆందోళన చెందుతున్నారు. అయితే దీనికోసం సంతూర్ కు వెళ్లవలసి అవసరం లేదని, ఏ రేషన్ కార్డు షాపు నైనా అప్డేట్ చేసుకోవచ్చని అధికారులు తెలియచేశారు. ఈ కేవైసీ అప్డేట్ కాకపోతే రేషన్ పంపిణీ ఇబ్బందులు ఎదుర్కొనే ఆస్కారం ఉంది.

పౌరసరపరాల విభాగం సర్కిల్ 2 పరిధిలో రేషన్ కార్డులు ఎవరైనా ఈ కేవైసీ ప్రక్రియ చేయకపోతే ఈ నెల 31 లోగా తప్పనిసరిగా చేయాలని సురేందర్ గారు తెలిపారు. చీప్ రేషన్ అధికారి ఆదేశాల మేరకు శనివారం నుంచి ప్రత్యేక ఈ కేవైసీ సిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కేవైసీ పూర్తి చేయని అభ్యర్థులు జాబితాను సిద్ధం చేసి ఇంటికి సమాచారం అందచేయకపోతే ఫోన్ ద్వారా కూడా వారికి సంప్రదించి ఈ కేవైసీ పూర్తి చేయాలని ఆయన రేషన్ డీలర్కు & రేషన్ ఇన్స్పెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే తెలంగాణలో డెబిట్ కార్డ్ సైజులో క్యూఆర్ కోడ్ తో కొత్త రేషన్ కార్డు పంపిణీకి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే కార్డులు జిల్లాకు చేరుకున్నాయి. కార్డుపై యజమాని ఫోటో, యజమాని పేరు, అడ్రస్సు మరియు సీఎం రేవంత్, మంత్రి ఉత్తం గారి ఫోటో ముద్రించారు. త్వరలో CM రేవంత్ గారు రేషన్ కార్డు పంపిణీ ప్రారంభిస్తారు, రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి.

కేంద్రం కొత్తగా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేయడానికి కేంద్రం నిర్ణయించారు. ఈ ప్రక్రియ వచ్చే నెలలోనే ఇచ్చేలా రాష్ట్రాలు మార్గదర్శకాలు జారీ చేస్తున్నాయి. రాష్ట్రంలో ఆగస్టు 1వ నుంచి కోట పంపిణీ సిద్ధమవుతున్నాయి. ప్రతినెల తొలి 15 రోజులు మాత్రమే రేషన్ బియ్యం అందుబాటులో ఉంచేలా చేస్తున్నారు. వచ్చే ఆగస్టు, సెప్టెంబర్ & అక్టోబర్ నెలలకు సంబంధించి రేషన్ బియ్యం ఒకేసారి అందించేలా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనున్నారు.

